త్రీడీలు సాధ్యం కావాలంటే మోడీ తోనే సాధ్యం
నారద వర్తమాన సమాచారం: పోచంపల్లి, ప్రతినిధి:
దేశం, ధర్మం, డెవలప్మెంట్, మూడు డీలు సాధ్యం కావాలంటే అది కేవలం మోడీతోనే సాధ్యమని భువనగిరి బిజెపి పార్లమెంట్ అభ్యర్థి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు.
పురపాలక కేంద్రంలో శుక్రవారం బిజెపి చేనేత భరోసా యాత్ర ప్రారంభోత్సవ సందర్భంగా ముఖ్య అతిథులుగా అయన హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.
స్థానిక నేతన్న విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం స్థానిక మార్కండేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పద్మశాలి మహాజన సంఘ ప్రతినిధులతో చేనేతలో రంగంలో ఉన్న సమస్యలపై చేర్పించారు. అనంతరం రైతు భరోసా యాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ చేనేత కులవృత్తులని కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి పరచడమే బిజెపి లక్ష్యంగా పనిచేస్తుందని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా చేనేత రంగానికి అత్యంత ప్రాచుర్యాన్ని కల్పించింది బిజెపి ప్రభుత్వం తోనే సాధ్యమైందని ఆయన అన్నారు. ఎక్కడలేని విధంగా పోచంపల్లికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేవిధంగా అవార్డు సాధించిన ఘనత బిజెపి పార్టీకి దక్కిందని ఆయన తెలిపారు. చేనేతకంటూ ప్రత్యేకంగా ఒకరోజు ఉండాలంటే చేనేత దినోత్సవం ప్రభుత్వానికి సాధ్యమైందని ఆయన తెలిపారు. నాటి టిఆర్ఎస్ నేటి కాంగ్రెస్ ప్రభుత్వాలు చేనేతల సమస్యలు పట్టించుకోకుండా వారి జీవితాలతో ఆడుకుంటున్నాయని వారు అన్నారు. గతంలో ఎంపీగా పనిచేసిన నేను చేనేత రంగాన్ని ప్రోత్సహించడంలో లోక్ సభ స్పీకర్ కి కూడా చేనేత వస్త్రాలను అందించి వాటిని ధరించి ప్రాచుర్యం కల్పించాలని నా వంతుగా కృషి చేయడం జరిగిందని ఆయన తెలిపారు. మోత్కూర్, పోచంపల్లి సొసైటీలకు 10 కోట్లు తీసుకొచ్చి కార్మికులకు అందించాలని ఆయన గుర్తు చేశారు. లోక్ సభలో మోడీ ప్రభుత్వం వస్తే పూర్తిస్థాయిలో చేనేత రంగాన్ని ప్రోత్సహించే విధంగా ప్రభుత్వ అన్ని విధాలుగా కృషి చేయడానికి ముందుంటుందని ఆయన తెలిపారు. రానున్న ఎన్నికల్లో బిజెపికి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. చేనేత రంగాన్ని నిర్వీర్యం చేసింది గత ప్రభుత్వాలే అని
బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు అన్నారు. పురపాలక కేంద్రంలో నిర్వహించిన నూతన భరోసా యాత్ర కార్యక్రమానికి బూర నరసింహ గౌడ తో హాజరై యాత్రను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత సొసైటీలను పూర్తిగా నిర్వీర్యం చేసిన ప్రభుత్వం టీ ఆర్ఎస్ అని ఆయన అన్నారు. గడచిన పదేళ్లలో ఒక్కసారి కూడా సంస్థల ఎన్నికల నిర్వహించకుండా సొసైటీ నిర్వీర్యం చేసి చేనేత అభివృద్ధికి ఆటంకం కలిగించాయని ఆయన అన్నారు. రాష్ట్రంలోనే అత్యధిక చేనేత కార్మికులు ఉన్న జిల్లాగా ఉన్న కూడా ఏ విధమైన అభివృద్ధికి తావివ్వకుండా నిర్వీర్యపరిచారని వారు తెలిపారు.
బిజెపి ప్రభుత్వమే చేతివృత్తుల అభివృద్ధి పరచడం లక్ష్యంగా ముద్ర రుణాలు అందించి వారి జీవితాలకు బాసటగా నిలిచిందని ఆయన అన్నారు. సబ్సిడీ కూడా అందించి మరోసారి వారి అభివృద్ధిలో బాట వేస్తున్న ప్రభుత్వం బిజెపి అని ఆయన తెలిపారు. కార్పొరేట్ స్థాయిలో చేతి వృత్తుల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న బిజెపికి మరోసారి ఆశీర్వదించి మోడీ ప్రభుత్వాన్ని గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దాసరి మల్లేశం, కర్నాటి ధనంజయ, బిజెపి కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర నాయకులు దోనూరు వీరారెడ్డి, సీ, న్ రెడ్డి, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి యన్నం శివకుమార్, బిజెపి రాష్ట్ర కిసాన్ మోర్చా అధికార ప్రతినిధి సురకంటి రంగారెడ్డి, చేనేత సెల్ జిల్లా కన్వీనర్ గంజి బసవలింగం, అసెంబ్లీ కన్వీనర్ చెక్క కృష్ణ, కిసాన్సుల్ జిల్లా ఉపాధ్యక్షులు మేకల చొక్కా రెడ్డి, బిజెపి మండల పట్టణ శాఖ అధ్యక్షులు డబ్బికారు సాహిష్, గుండ్ల రాజు యాదవ్, మండల ప్రధాన కార్యదర్శి బైరు వెంకటేష్ గౌడ్, సీనియర్ నాయకులు చింతల రామకృష్ణ కొంతం శంకర్ గౌడ్, కేసారం కృష్ణారెడ్డి, పట్టణ నాయకులు ఏలే శ్రీనివాస్, తండ రమేష్, నాయకులు వినయ్, చెరుకు వెంకటేష్, బండిరాల సుశీల, వంగూరి రాజు, ఒంటెద్దు సత్యం, తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.