నారద వర్తమాన సమాచారం
మన్యం వీరుడికి ఘన నివాళులర్పించిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపిఎస్
నరసరావుపేట :-
విప్లవ వీరుడు,మన్యం ప్రజల ఆరాధ దైవం అల్లూరి సీతారామరాజు 101వ వర్ధంతి పురస్కరించుకొని బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస రావు ఐపీఎస్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర్య ఉద్యమంలో చేసిన పోరాట స్ఫూర్తిని ఈ సందర్భంగా మనందరం గుర్తు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పేర్కొన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ సామ్రాజ్యం దోపిడిని ఎదుర్కోవడానికి మన్యం ప్రజల, పేదవారికి అండగా నిలిచి విప్లవ యోధులు గా తయారుచేసి గిరిజనుల లో చైతన్యం తీసుకువచ్చిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు అని,తెల్లదొరలకు బందీ కాబడి వీర మరణం పొందిన మహాయోధుడు అల్లూరి సీతారామరాజు అని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సీతారామరాజు యొక్క గొప్పతనాన్ని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్పీ తో పాటు ఏ ఆర్ డిఎస్పీ మహాత్మా గాంధీ రెడ్డి, సబ్ 1 సీఐ బండారు సురేష్ బాబు ,వెల్ఫేర్ ఆర్ ఐ ఎల్ .గోపినాథ్ , ఏ ఎన్ ఎస్ ఆర్ఐ ,ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.