నారద వర్తమాన సమాచారం
ఆధారాల సేకరణలో కచ్చితత్వం పాటిస్తే ముద్దాయిలకు శిక్షలు పడే విధంగా కృషి చేయవచ్చు.- పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస రావు ఐపీఎస్
నరసరావుపేట:-
ఈరోజు(08.05.2025) పల్నాడు జిల్లా కలెక్టరేట్ గుర్రం జాషువా కాన్ఫరెన్స్ హాల్ నందు ఎస్పీ ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ అధికారులకు “ఫోరెన్సిక్ సాక్ష్యాల నిర్వహణ (ఫారెంజిక్ ఎవిడెన్స్ మానేజ్మెంట్)” అనే అంశంపై నిర్వహించిన “చర్చా వేదిక (వర్క్ షాప్)” కార్యక్రమం.
పాల్గొన్న పల్నాడు జిల్లా ఎస్సైలు, సీఐలు మరియు డిఎస్పీలు
దర్యాప్తు ప్రక్రియకు ఉపకరించే అనేక మెళకువలను పోలీస్ అధికారులకు వివరించిన ఫోరెన్సిక్ నిపుణులు
నిపుణులు అందించిన మెళకువలను క్షేత్ర స్థాయిలో ఉపయోగించి కేసుల్లో ముద్దాయిలకు శిక్షలు పడే విధంగా సమగ్ర దర్యాప్తులు చేపట్టాలని సూచించిన ఎస్పీ
ఈ చర్చా వేదిక(వర్క్ షాప్) ద్వారా ఏదైనా కేసుకు సంబంధించి ఘటన జరిగిన ప్రదేశం నుండి న్యాయస్థానంలో కేసు విచారణకు వెళ్ళే వరకు పొందుపరచే ప్రతి ఆధారాన్ని భౌతికంగా, సాంకేతిక పరంగా ఏ విధంగా సేకరించాలనే విషయాలను గురించి కూలంకషంగా వివరించిన ఫోరెన్సిక్ నిపుణులు.పలు అంశాలకు సంబంధించి ఈ చర్చా వేదిక నిర్వహించగా, వాటిలో ముఖ్యమైనవి :-
1) ఫోరెన్సిక్ సాక్ష్యాల నిర్వహణ(ఫారెంజిక్ ఎవిడెన్స్ మానేజ్మెంట్).
2) సాక్ష్యాల సేకరణ విధానాలు/పద్ధతులు(ఎవిడెన్స్ కలెక్షన్ ప్రొసీజర్స్).
3) గొలుసు పద్ధతిలో ఆధారాల అమరిక.(చైన్ అఫ్ కస్టడై ప్రోటోకల్స్).
4) దర్యాప్తులో చేయదగినవి/ చేయకూడనివి.(ఇన్వెస్టిగేటివ్ డాగ్స్ అండ్ డోన్ట్ స్).
5) అధునాతన సాంకేతిక విధానాలు(లేటెస్ట్ సైంటిఫిక్ ట్రెండ్స్).
పైన తెలిపిన అంశాల ఆధారంగా పోలీస్ స్టేషన్లలో నమోదయ్యే దొంగతనం, హత్య, అత్యాచారం, ఆత్మహత్య, చైన్ స్నాచింగ్, రోడ్డు ప్రమాదాలు, మాదక ద్రవ్యాలు, సామాజిక మాధ్యమాలు మొదలగు పలు విషయాలకు సంబంధించిన కేసుల్లో ఘటన జరిగిన ప్రదేశం నుండి న్యాయస్థానాలలో కేసుకు సంబంధించిన ఆధారాలు ప్రవేశపెట్టే వరకు ఉన్న అన్ని ఘట్టాల్లో
భౌతిక ఆధారాలు అనగా ఆయుధాలు, వస్త్రాలు, పదార్థాలు మరియు వివిధ వస్తువులు వంటివి.
సాంకేతిక ఆధారాలు అనగా ఘటన ప్రదేశంలో వేలి,కాలి ముద్రలు,రక్తపు మరకలు, సీసీటీవీ కెమెరా ఫుటేజ్ లు, వీడియో/ఆడియో రికార్డింగ్ లు, ఫోటోలు వంటివి.వాటిని ఏ విధంగా సేకరించాలి..?, ఏ విధంగా సేకరిస్తే వాటికి చట్టబద్ధత వస్తుంది..? అని పలు కోణాల్లో అవగాహన కల్పించడం జరిగింది.
ఇటువంటి ప్రత్యేక చర్చా వేదిక(వర్క్ షాప్) కార్యక్రమాల నిర్వహణకు ప్రోత్సహిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్తా ఐపిఎస్ కి, సౌత్ కొస్టల్ జోన్ ఐ జి సర్వ శ్రేష్ట త్రిపాఠి కి ప్రత్యేక కృతజ్ఞతలు, అదే విధంగా ఈ చర్చా వేదిక నందు జిల్లా పోలీసు అధికారులకు కేసుల దర్యాప్తుకు సంబంధించి పలు మెళకువలను అందజేసిన ఫోరిన్సిక్ నిపుణుల బృందానికి కూడా కృతఙ్ఞతలు తెలిపిన ఎస్పీ
ఈ కార్యక్రమంలో ఎస్పి తో పాటు ఫోరెన్సిక్ సైంటిఫిక్ అధికారులు డి. కాంచన గోదర
ఎల్. స్వాతి కె.సురేంద్రబాబు , ఫోరెన్సిక్ అసిస్టెంట్ డైరెక్టర్లు బి. రామకృష్ణారావు పల్నాడు జిల్లా డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
కార్యక్రమం అనంతరం ఫోరెన్సిక్ సైంటిఫిక్ అధికారులకు పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపీఎస్ శాలువా కప్పి మెమొంటో తో సత్కరించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.