నారద వర్తమాన సమాచారం
రైతు బజార్లో వినియోగదారునికి అవగాహన కల్పిస్తున్న తూనికలు కొలతల శాఖ అధికారులు
తూనికలు కొలతల శాఖ ఆధ్వర్యంలో వినియోగదారులకు, వర్తకులకు అవగాహన సదస్సు
తూనికలు కొలతలు శాఖ పల్నాడు జిల్లా ఆధ్వర్యంలో పట్టణంలోని రైతు బజార్ లో
వినియోగదారులకు మరియు వర్తకులకు లీగల్ మెట్రోలజీ అధికారులు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా లీగల్ మెట్రాలజీ పల్నాడు జిల్లా ఇన్స్పెక్టర్ డి.శివశంకర్ మాట్లాడుతూ వినియోగదారులు కూరగాయలు, నిత్యవసర సరుకులు కొనుగోలు చేసినప్పుడు వారికి ఖచ్చితమైన తూకం ప్రకారం విక్రయించాలని, అందుకు వాడే కాటాలను ప్రతి సంవత్సరం లీగల్ మెట్రాలజీ వారి స్టాంపింగ్ కు పంపించి తప్పనిసరిగా రసీదు పొందాలని తెలిపారు. పల్నాడు జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్ పిల్లి యజ్ఞ నారాయణ మాట్లాడుతూ వినియోగదారులు కొనుగోలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ఖచ్చితమైన తూకం అడిగే హక్కు వినియోగదారునికి ఉందని, తూకాలలో తక్కువ గనక ఉంటే నేషనల్ కన్స్యూమర్స్ హెల్ప్ లైన్ నంబర్ 1915 కి లేదా
సంబంధిత అధికారులకు లేదా వినియోగదాల సంఘ ప్రతినిధులకు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. అలాగే ప్యాక్ చేసిన వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు వాటి పై ప్యాకెడ్ కమెడిటీస్ రూల్స్ ప్రకారం ముద్రలు సక్రమంగా వున్నది లేనిది, తయారీ తేదీ, గడువు ముగియు తేదీ, తయారీదారుని పూర్తి చిరునామా, కస్టమర్ కేర్ నంబర్, ఎం.ఆర్.పి. మొదలగునవి సక్రమంగా ముంద్రించినది లేనిది తనిఖీ చేసి కొనుగోలు చేయాలన్నారు. బస్తాలు కొనుగోలు చేయనప్పుడు బస్తాపై ముద్రించి వున్న బరువుతో సరిపోతుందో లేదో తనిఖీ చేయాలన్నారు. తూనికలలొ తేడా వున్న 1915 కి గాని, సంబంధిత అధికారులకు గాని తెలియజేయాలని తెలిపారు. రైతు బజార్లో వ్యాపారం నిర్వహిస్తున్న వర్తకులకు, వినియోగదారుకు వస్తువులు కాటా వేసే విధానం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా వినియోగదారుల హక్కుల పరిరక్షణ ఫోరం ఇంచార్జ్ మురికిపూడి ప్రసాద్, జాయింట్ సెక్రెటరీ విక్రమ్, రైతు బజార్ ఎస్టేట్ మేనేజర్ కాజా తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.