నారద వర్తమాన సమాచారం
జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన పల్నాడు జిల్లా పోలీసులు.
నరసరావుపేట:-
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డి.జి.పి హరీష్ కుమార్ గుప్తా, ఐ పీ ఎస్ ఆదేశాల మేరకు, జిల్లా ఎస్పీ కంచి.శ్రీనివాస రావు, ఐ పీ ఎస్ నేతృత్వంలో నిన్న అనగా ది.08.05.2025 వ తేదీ గురువారం రాత్రి జిల్లా అంతటా స్పెషల్ డ్రైవ్ నిర్వహణ.
ది.08.05.2025 వ తేదీ గురువారం రోజు రాత్రి 9.00 గంటల నుండి 11.00 గంటల వరకు జరిగిన ఈ స్పెషల్ డ్రైవ్ లో జిల్లా అంతటా ముమ్మరంగా వాహనాల తనిఖీలు, లాడ్జీ ల తనిఖీలు, బస్టాండ్, రైల్వే స్టేషన్ తనిఖీలు, అనుమానాస్పద వ్యక్తుల కదలికల గుర్తింపు నిర్వహించిన జిల్లా పోలీసు యంత్రాంగం.
స్వయంగా స్పెషల్ డ్రైవ్ లో పాల్గొని పట్టణములోని రైల్వే స్టేషన్, బస్టాండ్ లను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస రావు, ఐ పి ఎస్
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ
ప్రజల భద్రతను మెరుగుపరిచేలా, నేరాల నియంత్రణ కోసం, శాంతి భద్రతల పరిరక్షణకు దోహదపడేలా ఈ డ్రైవ్ ముఖ్యంగా అమలు చేయబడింది.
ఈ స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా వివిధ పోలీస్ స్టేషన్లు తమ పరిధిలో ఉన్న అనుమానిత ప్రాంతాలలో సోదాలు నిర్వహించారు.
ఈ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా ప్రధానంగా వాహనాల తనిఖీలు, లాడ్జీలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల పరిసరాలు, శివారు ప్రాంతాల్లో పోలీసు బలగాలు ముమ్మర తనిఖీలు నిర్వహించారు.
అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తులను తనిఖీ చేసి, వారి గుర్తింపు వివరాలను నమోదు చేశారు.
వాహనాలు, బైక్‌లు, కార్లు, ఆటోలు మొదలైన వాటిని ఆపి పరిశీలించారు.
లాడ్జీ లలో నిర్ధారణ లేకుండా బస చేస్తున్న వారిని, రిజిస్ట్రేషన్ లేకుండా గదులు కేటాయించే వారిపై ప్రత్యేక దృష్టి సారించారు.
ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అసాంఘిక శక్తులు దాగి ఉండే అవకాశాలను ముందుగానే గుర్తించి చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.