నారద వర్తమాన సమాచారం
న్యాయస్థానాల్లో రౌడీ షీటర్లు, ఎన్ డి పి ఎస్ ,పోక్సో కేసుల్లో ముద్దాయిలకు త్వరితగతిన శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకోండి.- ఎస్పీ కంచి.శ్రీనివాస రావు ఐపీఎస్
నరసరావుపేట:-
ఈరోజు(10.05.2025)న జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో కోర్టు కానిస్టేబుళ్ళతో నిర్వహించిన సమావేశంలో పాల్గొని, పలు సూచనలు సలహాలు ఇచ్చిన జిల్లా ఎస్పీ
పల్నాడు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లకు సంబంధించి వివిధ న్యాయస్థానాల్లో విచారణలో ఉన్న కేసుల విచారణను వేగవంతం చేసే విధంగా తగిన ప్రణాళికలు రూపొందించి, సంబంధిత పోలీస్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ తగిన సాక్ష్యాధారాలను సమర్పించి, ముద్దాయిలకు త్వరితగతిన శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించిన ఎస్పీ
న్యాయస్థానాల్లో వివిధ కేసుల్లోని ముద్దాయిలు, రౌడీ షీటర్ల హాజరు, దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న నాన్ బెయిలబుల్ వారంట్ల జారీ పట్ల శ్రద్ధ వహించి, అమలును వేగవంతం చేసి, ముద్దాయిలను కోర్టులో హాజరు పరచాలని, ముద్దాయిల జాడ తెలియని పక్షంలో వారికి ఉన్న షూరిటీలను కోర్టుకు హాజరు పరచి తద్వారా జరగవలసిన ప్రక్రియ చేపట్టాలని, ముఖ్యంగా హత్య, హత్యాయత్నం, ఎన్ డి పి ఎస్ ,పోక్సో, అత్యాచార కేసుల్లో నేరాలకు సంబంధించిన విచారణను సంబంధిత కోర్టులో త్వరితగతిన జరిగేటట్లు చేసి, ముద్దాయిలకు శిక్షలు పడేటట్లు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఆయా కేసులకు సంబంధించి చార్జిషీట్లను కోర్టులో దాఖలు చేసిన తర్వాత పి ఆర్ సి ( ప్రిలిమినరీ రిజిస్ట్రేషన్ కేసు)నంబరు, ఎస్సీ ( సెషన్స్ కేసు) నంబరు, సీసీ(కోర్టు కేసు) నంబర్లు సకాలంలో వచ్చే విధంగా చూసి, తద్వారా కేసుల విచారణ ప్రక్రియ చేపట్టే విధంగా కృషి చేయాలని సూచించారు.
రౌడీ షీటర్లు, ఎన్ డి పి ఎస్ కేసులోని ముద్దాయిలకు తగిన రీతిలో శిక్షలు పడే విధంగా చేస్తే, ఇంకొకరు అటువంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకుండా ఉంటారని సూచించారు.
గత నెలలో ఆయా న్యాయస్థానాల్లో పలు కేసులకు సంబంధించి వచ్చిన తీర్పులు, ముద్దాయిలకు పడిన శిక్షల పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, శిక్షల విధింపులో మరింత కృషి చేస్తే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే.రౌడీ షీటర్లు, ఎన్ డి పి ఎస్ కేసుల్లో ముద్దాయిలు) వారిని కట్టడి చేయగలమని, కొంతమంది కేసులు పెట్టినా తమ ప్రవర్తన మార్చుకోవడం లేదని, వారిపై నమోదైన కేసుల్లో న్యాయస్థానాల్లో శిక్షలు పడేటట్లు చేసి తగిన గుణపాఠం చెప్పాలని సూచించారు.
ఎన్ ఐ యాక్ట్ మరియు వివిధ కేసులలో పెండింగ్ లో ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్స్ ను త్వరిత గతిన అరెస్ట్ చేసి కోర్టు నందు హాజరు పరిచి జ్యుడిషియల్ కస్టడీ కు పంపే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఎస్పీ తో పాటు అడిషనల్ ఎస్పీ జి.వి సంతోష్ , డి సి ఆర్ బి సి ఐ.ఎమ్ .శ్రీనివాస రావు ఆయా పోలీస్ స్టేషన్ల కోర్టు కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్ళు, ఏఎస్సైలు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.