అక్రమ వడ్డీ వ్యాపారాలు నిర్వహిస్తున్న వారి కేంద్రాలపై పోలీసుల దాడులు ముమ్మర తనిఖీలు విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం
అక్రమ మార్గాల ద్వారా అధిక వడ్డీల ద్వారా అమాయక ప్రజల నుండి డబ్బులు వసూలు చేస్తున్న వారిపై కేసులు నమోదు జిల్లా ఎస్పీ సింధు శర్మ
నారద వర్తమాన సమాచారం కామారెడ్డి జిల్లా ప్రతినిధి: ఏప్రిల్ 12,
జిల్లాలో అక్రమ వడ్డీ వ్యాపారాలు నిర్వహిస్తున్న వారి కేంద్రాలపై పోలీసుల దాడులు ముమ్మర తనిఖీలు విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం.అక్రమ మార్గాల ద్వారా, అధిక వడ్డీల ద్వారా అమాయక ప్రజల నుండి డబ్బులు వసూలు చేస్తున్న వారిపై కేసులు నమోదు- జిల్లా ఎస్పీ సింధు శర్మ
70 రైడ్స్, 23 కేసులు నమోదు, 49 లక్షల 58000, 157 గ్రాముల బంగారం,315 ప్రామిసరి నోట్లు, 63 ల్యాండ్ డాక్యుమెంట్స్ 24 అగ్రికల్చర్ ల్యాండ్ డాక్యుమెంట్లు, 25 చెక్స్, పట్టా పాస్ బుక్కులు మరియు కాళీ ప్రామిసరీ నోట్స్, నోట్స్ బుక్స్ ను మరియు ఇతర డాక్యుమెంట్స్ ను స్వాధీనం చేసుకోవడం జరిగింది.జిల్లాలో ఎలాంటి అనుమతులు లేకుండా కొందరు, మోసపూరిత మాటల ద్వారా మరికొందరు వ్యాపారులు అమాయక ప్రజలను చూసి ఆర్థిక సహాయం చేస్తామని తెలుపుతూ వారి వద్ద నుండి ఇల్లు మరియు ప్లాటు వ్యవసాయ భూముల దస్తావేజులను తీసుకొని అప్పులు ఇస్తున్నారు. తిరిగి డబ్బులు చెల్లించాలని అధిక వడ్డీ రేట్ల లెక్కలు చూపుతూ చెల్లించలేని పరిస్థితులను తీసుకువస్తూ వారి ఆస్తుల దస్తావేజులను జప్తు చేసుకోవడం జరుగుచున్నది. ఇలా వ్యాపారం చేస్తున్నారు అని అనుమానం/ సమాచారం ఉన్న వ్యాపారులందరిపై జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో దాడులు చేయడం జరిగింది. తనిఖీలలో పట్టుబడ్డ ఆధారాలను పరిగణలోకి తీసుకొని ఇలాంటి అక్రమ వ్యాపారాలు చేస్తున్న వారిపై కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 70 రైడ్స్ చేయడం జరిగింది. అందులో 23 కేసులు నమోదు చేయబడినవి. దీనిలో భాగంగా 49 లక్షల 58000, 157 గ్రాముల బంగారం,315 ప్రాసరి నోట్లు, 63 ల్యాండ్ డాక్యుమెంట్స్ 24 అగ్రికల్చర్ ల్యాండ్ డాక్యుమెంట్లు, 25 చెక్స, పట్టా పాస్ బుక్కులు మరియు కాళీ ప్రామిసరీ నోట్స్, నోట్స్ బుక్స్ ను మరియు ఇతర డాక్యుమెంట్స్ ను స్వాధీనం చేసుకోవడం జరిగింది.వ్యాపారులు చేస్తున్న ఆర్థిక మోసాలను తట్టుకోలేక ఎంతోమంది బాధితులు కుటుంబ సమేతంగా ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. ఇలాంటి ఆత్మహత్యలను నివారించాలనే ఉద్దేశంతోనే అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో మోసపూరిత వ్యాపారులపై దాడులు చేయడం జరిగింది
కావున చట్ట వ్యతిరేక చర్యలు పాలు పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ
సి హెచ్ సింధు శర్మ తెలియజేయడం జరిగింది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.