నారద వర్తమాన సమాచారం
నాలుగు పర్యాటక ప్రదేశాల్లో యోగా ప్రదర్శన
5 న రాష్ట్ర స్థాయి కార్యక్రమం కొనసాగుతున్న యోగా శిక్షణ
యోగాంద్ర కార్యక్రమానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్రతి ఒక్కరికి యోగా గొప్పతనాన్ని వివరించి, వారి చేత యోగాసనాలను అభ్యసింపజేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగానే ఇప్పటికే జిల్లాలో ఎంపిక చేసిన మాస్టర్ ట్రైనీలు, టిఓటిలకు శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ శిక్షణా కార్యక్రమం రెండో రోజు ఆదివారం కూడా కొనసాగింది.ఆన్లైన్ ద్వారా జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో శిక్షణ నిర్వహించారు. యోగా గురువులు, టివోటీలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
జిల్లాలో నాలుగు పర్యాటక ప్రాంతాల్లో భారీ స్థాయిలో యోగా ప్రదర్శించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించింది. దీని ప్రకారం ఈనెల 28న
కోటప్పకొండ
వద్ద, జూన్ 5న నాగార్జున సాగర్ వద్ద, 11న
కొండవీడు కోట, వద్ద,18 న అమరావతి వద్ద యోగా ప్రదర్శనలు నిర్వహించనున్నారు.
యోగాంధ్ర కార్యక్రమంలో అంశాల ప్రాతిపదికగా ప్రతీ జిల్లాకు ఒక థీమ్ ను ప్రభుత్వం కేటాయించింది. దీనిలో భాగంగా జిల్లాలో వేలాది మంది ANMలు మరియు ఆశా వర్కర్లు వర్కర్లతో జూన్ 5 యోగా ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించడానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
శిక్షణ పొందినవారితో
బాటు, సామాన్య ప్రజలు సైతం ఈ యోగా స్ట్రీట్ కి వచ్చి ఆసనాలను అభ్యాసం చెయ్యవచ్చు.పోలీసు శాఖ అధ్వర్యంలో దీనిలో భాగంగా సోమవారం ఉదయం
నరసరావుపేట లోని కలెక్టర్ బంగ్లా రోడ్డు వద్ద ప్రధాన రహదారిపై యోగా ప్రదర్శన నిర్వహించడానికి ఏర్పాటు చేశారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.