నారద వర్తమాన సమాచారం
యోగాంధ్ర 2025:
కోటప్పకొండ ప్రాంతం యోగా స్పూర్తితో చిగురించనుంది
జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా ‘యోగాంధ్ర 2025 పేరిట ఒక వినూత్న యోగా అవగాహన కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్లో యోగా పట్ల చైతన్యం పెంపొందించేందుకు నెల రోజులపాటు ఈ యోగా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని 104 ప్రధాన పర్యాటక ప్రదేశాలను కేంద్రంగా చేసుకొని యోగా శిబిరాలు, పోటీలు, బోధన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
ఈ మహత్కార్యంలో
పల్నాడు జిల్లా కూడా భాగస్వామ్యమవుతోంది. జిల్లాలోని నాలుగు కీలక పర్యాటక ప్రదేశాలలో యోగా శిబిరాలు నిర్వహించనున్నట్టు జిల్లా కలెక్టర్ శ్రీ పి. అరుణ్ బాబు తెలిపారు
ప్రత్యేక ఆకర్షణగా బుధవారం రోజు కోటప్పకొండ శైవ క్షేత్రం
మే 28, ఉదయం 6.30 గంటల నుంచి 8.30 వరకు కోటప్పకొండ శైవ క్షేత్రం వద్ద విశాలమైన ప్రకృతి వాతావరణంలో యోగా శిబిరం నిర్వహించనున్నారు. ఈ శిబిరంలో యోగా శిక్షకులు, అధికారులు, స్థానిక ప్రజలు, యువతీయువకులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు.
ఇతర ముఖ్య శిబిరాలు:
జూన్5: నాగార్జునసాగర్
జూన్ 11: కొండవీడు కోట
జూన్ 18: అమరావతి బుద్ధ పార్క్
జూన్ 5న ANM/ASHA చే రాష్ట్రస్థాయి యోగా కార్యక్రమం
రాష్ట్ర ప్రభుత్వం మే 26 నుంచి జూన్ 20 వరకు ప్రతిరోజు ఒక ఇతివృత్తంతో ఒక జిల్లాలో రాష్ట్రస్థాయి యోగా కార్యక్రమాల్ని నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా జిల్లాలో జూన్ 5న న ANM/ASHA తో సామూహిక యోగ కార్యక్రమాన్ని నిర్వహించడానికి జిల్లా యంత్రాంగం సంసిద్ధమవుతోంది.
స్థాయివారీగా పోటీలు కూడా:
యోగ పై అవగాహన కల్పించేందుకు జిల్లా మండల గ్రామస్థాయిలో యోగాపై పోటీలు నిర్వహించనున్నారు.
మే 26 – మే 30: గ్రామ స్థాయిలో యోగా పోటీలు
జూన్ 2 – జూన్ 7: మండల స్థాయిలో
జూన్ 9 – జూన్ 14: జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించనున్నారు.
ఈ యోగా చైతన్య యాత్ర ద్వారా ప్రజలు శారీరక, మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంపొందించుకోగలుగుతారు.
యోగా అనుభూతి స్థానికులకే కాకుండా సందర్శకులకు సైతం ఒక కొత్త స్పూర్తి నిచ్చే అవకాశం కల్పించనుంది.
యోగాంధ్ర 2025 కేవలం యోగా కార్యక్రమం మాత్రమే కాక, అది ప్రజల ఆరోగ్యాన్ని, జీవనశైలిని మార్చే ఉద్యమంగా మారుతోంది. ప్రజలందరూ యోగాను తమ జీవన విధానంలో భాగంగా మార్చుకోవాలని జిల్లా యంత్రాంగం కృషి చేస్తోంది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.