నారద వర్తమాన సమాచారం
ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన శాసన సభ్యులు కన్నా మరియు జడ్పీ చైర్ పర్సన్ కత్తెర హేని క్రిస్టినా
పేదల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భరోసా
పేదల కళ్ళల్లో ఆనందం చూడాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యం
బాధితులకు అండగా సీఎం సహాయనిది
గత ప్రభుత్వంలో సీఎం సహాయ నిధి నిర్వీర్యం అయిపోయింది
గత ఐదు సంవత్సరాలతో పోల్చుకుంటే సత్తెనపల్లి నియోజకవర్గం అభివృద్ధి బాటలో ముందుంది
కూటమి ప్రభుత్వంలో కార్పొరేట్ స్థాయిలో వైద్యం పొందలేని బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తుంది
సత్తెనపల్లి నియోజకవర్గంలోని పలువురు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 81మంది లబ్ధిదారులకు మంజూరైన 65 లక్షల 79 వేల 351 రూపాయల విలువ గల చెక్కులను సత్తెనపల్లి నియోజకవర్గ శాసన సభ్యులు కన్నా లక్ష్మి నారాయణ మరియు జడ్పి జడ్పీ చైర్ పర్సన్ హేనీ క్రిస్టినా అందించడం జరిగింది.
సత్తనపల్లి నియోజకవర్గంలో ఒక సంవత్సర కాలంలోనే 25 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం
రానున్న రోజుల్లో సత్తెనపల్లి నియోజకవర్గాన్ని ఇంకా అభివృద్ధి చేసి చూపిస్తాం
జడ్పీ నిధుల నుంచి నుంచి సత్తెనపల్లి నియోజకవర్గానికి 90 లక్షల కేటాయించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు
సత్తెనపల్లి నియోజకవర్గం లో పెండింగ్ లో ఉన్న జడ్పీ కి సంబంధించిన వాటికీ త్వరలోనే నిధులు సమకూర్చి అభివృద్ధి పరుస్తాం
ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం
ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల మేరకు కొండమోడు పేరేచర్ల జాతీయ రహదారి విస్తరణ, సత్తెనపల్లి మాదిపాడు మార్గంలో ఆర్ఓబి నిర్మాణాల పనులను ఏడాది పాలనలోపే ప్రారంభించుకున్నట్లు చెప్పారు.
నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు జిల్లా పరిషత్ నుంచి 90 లక్షల నిధులను జడ్పీ చైర్మన్ మంజూరు చేశారన్నారు.
బార్ కౌన్సిల్ విజ్ఞప్తి మేరకు నూతన కోర్టుల నిర్మాణానికి జడ్పీ స్థలాన్ని అందజేసేందుకు జిల్లా పరిషత్ ముందుకు వచ్చింది అన్నారు.
అర్ధంతరంగా ఆగిపోయిన జడ్పీ గెస్ట్ హౌస్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరుతున్నట్లు చెప్పారు.
జెడ్పీ గెస్ట్ హౌస్ ముందు వాణిజ్య సముదాయం నిర్మిస్తే ఆదాయం వస్తుందని చెప్పారు.
ఎన్నికల సందర్భంగా ఇచ్చిన అన్ని హామీలను కూటమి ప్రభుత్వ నెరవేరుస్తుందని కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు.
సత్తెనపల్లి కోర్ట్ లో మొత్తం 4 కోర్టు లు ఉన్నవి
గత 13 సంవత్సర కాలంలో మార్కెట్ యార్డ్ లో అద్దెకు 2 కోర్ట్ లు మరియు.సత్తెనపల్లి తాలూకా దగ్గర 2 కోర్ట్ లు పనిచేస్తున్నాయి
సత్తెనపల్లి బార్ అసోసియేషన్ పరిధిలోని న్యాయవాదులు కొత్తగా కోర్ట్ బిల్డింగ్ నిర్మించాలని గత 13 సంవత్సరాల నుండి స్థల సేకరణకు రాజకీయ నాయకులు దృష్టి కి తీసుకుని వెళ్లినా ఫలితం లేకుండా పోయింది.
కానీ మన శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ దృష్టి కి కోర్ట్ గురించి న్యాయవాదులు తీసుకుని వెళ్లగా ఆయన సకాలంలో స్పందించి. జిల్లా పరిషత్ చైర్మన్ హేని క్రిష్టీనా తో న్యాయస్థానం భవనాలు కట్టుకోవాలి అంటే స్థల సేకరణ చేయాలని నరసరావుపేట రోడ్డు లోని జడ్పీ సైట్ ని పరిశీలించి దానిని
న్యాయస్థానం భవనాలకు 2.60 సెంట్ల భూమి ని జడ్పీ చైర్మన్ తో మాట్లడి కేటాయించారు
ఈ కార్యక్రమం లో వివిధ హోదాల్లో వున్న రాష్ట్ర జిల్లా నియోజకవర్గపట్టణ మండల గ్రామ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.