నారద వర్తమాన సమాచారం
ఏపి క్యాబినెట్ సమావేశ ముఖ్యాంశాలు
సీఆర్డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోదం.
వివిధ సంస్థలకు చేసిన భూ కేటాయింపులు, రాయతీల కల్పనకు క్యాబినెట్ ఆమోదం.
రక్షితనీటి సరఫరాకు శ్రీకాకుళంలో రూ.5.75 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండ్ కు ఆమోదం.
కుప్పంలో రూ.8.22 కోట్లు వయబిలిటి గ్యాప్ ఫండ్ విడుదలకు ఆమోదం.
సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదలకే కేబినెట్ ఆమోదం. 1 ఫిబ్రవరి 2025 నాటికి అర్హులైన 17 మంది యావజ్జీవ ఖైదీలకు క్షమాభిక్ష మంజూరు.
248 మంది కానిస్టేబుళ్లకు పదోన్నతి కల్పించే ప్రతిపాదనకు ఆమోదం.
వైఎస్సార్ జిల్లా పేరును వైఎస్సార్ కడప జిల్లాగా మారుస్తూ తెచ్చిన జీవోకు కేబినెట్ ఆమోదం.
పోలీసు అకాడమీకి అదనంగా 94.45 ఎకరాలు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం.
మహిళలు రాత్రిపూట కూడా పనిచేసే చట్టసవరణకు ఆమోదం. రాత్రిపూట పనిచేసే మహిళలకు భద్రత, రవాణా సౌకర్యం కల్పించాలి….
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







