నారద వర్తమాన సమాచారం
నాగార్జునసాగర్ లో అనుపు వద్ద ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు ఐఏఎస్
యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా బుధవారం నాడు పల్నాడు జిల్లాలో ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన అనుపు వద్ద ఏర్పాటుచేసిన యోగా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రసిద్ధ పర్యాటక కేంద్రాల్లో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో యోగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. చాలా సంవత్సరాల తర్వాత ప్రకృతి సిద్ధమైన సహజ గాలి మరియు ప్రశాంత వాతావరణం లో ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమంలో సుమారు 2000 మంది పాల్గొన్నారన్నారు. యోగ అంటే మనతో మనం గడపడం అని ఆయన అన్నారు. రోజు యోగ చేయడం వల్ల క్రమశిక్షణ అలవాటు ఆవుతుందన్నారు. ప్రతిరోజు ఒక గంట పాటు ఉదయం పూట యోగ సాధన చేయవలసిన అవసరం ఉందన్నారు. ఉద్యోగస్తులకు ఒత్తిడికి దూరమై మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. అడిగిన వెంటనే స్థలాన్ని కేటాయించినందుకు సంబంధిత అధికారులను ఆయన అభినందించారు. జిల్లా రెవెన్యూ అధికారి మురళి మాట్లాడుతూ ఈనెల 21వ తారీఖున నిర్వహించనున్న ఇంటర్నేషనల్ యోగ డే సందర్భంగా యోగా కార్యక్రమాలు జిల్లాలో జిల్లా కలెక్టర్ వారి ఆదేశాలు మేరకు భారీ ఎత్తున విజయవంతంగా నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు. ఉద్యోగస్తులు ఎంత పని ఉన్నప్పటికీ అందరినీ ప్రేరేపితం చేయాలన్నారు. డాక్టర్లు సైతం యోగ సాధన చేస్తూ రుగ్మతలు దూరంగా ఉన్నారని మందులు వాడటం లేదని అన్నారు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ క్యూరేటర్ కమల్ హాసన్ మాట్లాడుతూ క్రీస్తు శకం మూడో శతాబ్దంలో ఇక్ష్వాకులు ఈ ప్రాంతంలో రాజధానిగా చేసుకుని పరిపాలన సాగించారన్నారు. పురావస్తు శాఖ 2000 సంవత్సరం నాటి ప్రాచీన సంపదలను భద్రపరిచి భవిష్యత్తు తరాలవారికి తెలిపేలా అవసరమైన చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. నాగార్జునసాగర్ డ్యామ్ కట్టడం వల్ల చుట్టుపక్కల ప్రాంతాలు ముంపుకు గురికాకుండా నిలువరించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ రీజినల్ డైరెక్టర్ ప్రసన్న లక్ష్మీ , పర్యాటకశాఖ డివిజనల్ మేనేజర్ చైతన్య , ఆర్డీవో మురళీకృష్ణ డిస్టిక్ మెడికల్ ఆఫీసర్ డా.రవి
, ఇరిగేషన్ ఎస్ ఇ కృష్ణ మోహన్ , ఈ ఈ రమేష్ ,ఆర్ &బి ఎస్ ఈ రాజా నాయక్ ,పిడి డ్వామా సిద్ధ లింగమూర్తి, ఐసిడిఎస్ పిడి ఉమాదేవి, పిడి డిఆర్ డిఎ ఝాన్సీ రాణి, ట్రాన్స్పోర్ట్ అధికారి సంజీవ్ కుమార్ , డీఎఫ్ఓ ఫైర్ శ్రీధర్ రావు, డి ఎల్ డి వో గబ్రు నాయక్, హౌసింగ్ ఈ ఈ రవీంద్ర , డిపిఓ నాగేశ్వర నాయక్ , జిల్లా పర్యాటక అధికారి నాయుడమ్మ , జిల్లా మత్స్యశాఖ అధికారి సంజీవరావు , డిసిఒ వెంకటరమణ, ఏపీఎంఐపీ ఆంజనేయులు, ఏ పి టి డి సి డిప్యూటీ మేనేజర్ శివారెడ్డి , గ్రౌండ్ వాటర్ అధికారి శ్రీనివాస రావు, మాచర్ల మున్సిపల్ కమిషనర్ వేణు బాబు, మాచర్ల తహసీల్దార్ కిరణ్ బాబు , మాచర్ల యంపిడిఓ…సోషల్ వెల్ఫేర్ అధికారి,ఇతర శాఖల అధికారులు అందరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాచర్ల పట్టణానికి సంబంధించిన గురువు మెట్టు గోవిందరెడ్డి దాదాపు 200 యోగ మ్యాట్స్ కలెక్టర్ చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది.. ఈ సందర్భంగా యోగా డేని పురస్కరించుకొని బెలూన్లను గాలిలోకి వదిలారు…
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







