నారద వర్తమాన సమాచారం
నేడు పూరి జగన్నాథ్ ని రథయాత్ర
రథయాత్ర
ఒడిశా పూరి టెంపుల్ లో
ఉత్సవానికి
రెండు రోజులు ముందు అమావాస్య నాడు, నూతన దేవతామూర్తుల నేత్రోత్సవం… తర్వాత యథావిధిగా పూజలు మొదలవుతాయి. మరుసటి రోజు ప్రజలకు జగన్నాధ స్వామి నవయవ్వన దర్శనం లభిస్తుంది.
ఆషాఢ శుక్ల విదియనాడు పాండాలు మేళతాళాలతో ఉదయకాల పూజలు నిర్వహించి ‘మనిమా’ (జగన్నాథా…) అంటూ పెద్దపెట్టున నినాదాలు చేస్తూ విగ్రహాల్ని కదిలిస్తారు. ఆనందబజారు, అరుణస్తంభం మీదుగా అత్యంత కోలాహల వాతావరణంలో ఊరేగిస్తూ రథం వెనక భాగం నుంచి తీసుకువచ్చి రత్నపీఠం మీద అలంకరింపజేస్తారు. ఈ ఉత్సవాన్ని ‘పహండీ’ అంటారు. ఆ దశలో కులమత భేదాలకు తావుండదు. గుండిచా ఆలయానికి వెళ్లేందుకు సిద్ధమైన సుభద్ర, జగన్నాథ, బలభద్రులు రథారూఢులై ఉండగా… ‘ఇలపై నడిచే విష్ణువు’గా గౌరవాభిమానాల్ని అందుకునే పూరీ రాజు పల్లకీలో అక్కడికి చేరుకోవడంతో సంరంభాలు మిన్నంటుతాయి. పరమాత్ముని ముందు సేవకుడిగా మారిన ఆ మహారాజు బంగారపు చీపురుతో రథాల లోపల ఊడుస్తాడు. దీన్నే ‘చెరా పహారా’ అంటారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.