నారద వర్తమాన సమాచారం
మావోల నుంచి బెదిరింపులు.. బీజేపీ ఎంపీ రఘునందన్‌రావుకు భద్రత పెంపు!
,తెలంగాణ ములుగు జిల్లా కల్లుగీత కార్మికుడు సర్వాయి పాపన్న వారసులం
అయితే ఇటీవల మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలోని ఒక ప్రైవేటు పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి హాజరైన ఎంపీ రఘునందన్ రావుకు ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి బెదిరింపు కాల్ రావడం తీవ్ర కలకలం రేపింది. ఫోన్ చేసిన వ్యక్తి తాను మధ్య ప్రదేశ్‌కు చెందిన పీపుల్స్ వార్ మావోయిస్టునంటూ.. సోమవారం సాయంత్రంలోగా ఆయన్ను హతమారుస్తానని హెచ్చరించినట్టు వార్తలు వచ్చాయి. అయితే అగంతకుడు ఫోన్ చేసిన సమయంలో ఫోన్ మాట్లాడిన రఘునందన్‌రావు పీఏ.. ఈ బెదిరింపులపై రాష్ట్ర డీజీపీ ఫిర్యాదు చేశారు.
ఎంపీ రఘునందన్ రావు ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న తెలంగాణ పోలీస్ శాఖ, ఆయనకు వచ్చిన బెదిరింపు కాల్స్‌పై విచారణకు ఆదేశించింది. దీనిపై విచారణ జరిపిన తెలంగాణ పోలీస్ శాఖ రఘునందన్‌రావుకు అదనపు భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని నిర్ణయించింది. ఈ మేరకు ఇక నుంచి రఘునందన్‌రావు పర్యటనల సమయంలో సాయుధ పోలీసులతో కూడిన ఎస్కార్ట్ ( armed forces escort) ను ఏర్పాటు చేయాలని పోలీసు శాఖ నిర్ణయించింది. ఈ మేరకు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ముగ్గురు ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసింది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.