నారద వర్తమాన సమాచారం :ప్రతినిధి
పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం
వైసీపీని ఓడిద్దాం అమరావతిని నిర్మిద్దాం
మాలలకు మేలు చేసింది తెలుగుదేశం ప్రభుత్వమే
మాలల పంతం ఒక్కటే జగన్ అంతం
సత్తెనపల్లి పట్టణం రఘురామ్ నగర్ ప్రజా వేదిక నందు గుంటూరు ఆశీర్వాదం, ఏకుల రాజశేఖర్,పురం సుందర్ రావు, దారా ముసలయ్య, కోట బండి మస్తాన్ రావు, మరియు కమిటీ సభ్యులు ఏర్పాటుచేసిన మాలల నియోజకవర్గస్థాయి ఆత్మీయ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కన్నా
మాలల ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గొల్ల అరుణ్ కుమార్,దళిత బహుజన ఫ్రంట్ జాతీయ ప్రధాన కార్యదర్శి మేళం భాగ్య రావు, కాపునాడు జాతీయ అధ్యక్షులు గాళ్ళ సుబ్రహ్మణ్యం
ఈ కార్యక్రమంలో ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి. మాజీ మంత్రి వర్యులు సత్తెనపల్లి నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి కన్నా లక్ష్మి నారాయణ మాట్లాడుతూ.గత ఐదు ఏళ్లుగా చూస్తున్నాం.జగన్ పాలనలో దళితులకు ఒరిగింది ఏమీ లేదు. నా ఎస్సీ లు నా ఎస్టీలు అని అందరినీ మోసం చేసిన ఘనత అది ఒక్క జగన్ కే చెందుతుంది.దళితులను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన వాళ్లకే ప్రాధాన్యత ఇస్తున్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్ రెడ్డి పాలన లో దళిత బహుజనులకు తీరని ద్రోహం. సంక్షేమ పథకాలు పొందటం ప్రజల హక్కు జగన్ వేసే బిక్ష కాదు. ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరును విదేశీ విద్యకి తొలగించి నీ పేరు పెట్టుకుంటావా జగన్. చెత్త పొన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. 27 పథకాలు రద్దుచేసి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు నవరత్నాలకు మళ్లించిన జగన్ రెడ్డికి ఓటు అడిగే హక్కు కూడా లేదు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జగన్ రెడ్డి పాలనకి స్వస్తిపలికి తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకుని సమాజంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందాం అభివృద్ధిని సాధించుకుందాం తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా నన్ను పార్లమెంట్ అభ్యర్థిగా లావు శ్రీకృష్ణదేవరాయలు కి ఓట్లు వేసి అత్యధిక మెజారిటీ తోటి గెలిపించాలని అభ్యర్థించారు.
ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర జిల్లా నియోజకవర్గ పట్టణ మండల గ్రామ దళిత నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.