నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా నరసరావుపేట కలెక్టర్ కార్యాలయం ఎస్. ఆర్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జరిగిన “డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ” సమావేశానికి హాజరు అయిన పల్నాడు జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు,ఎస్పీ కంచి శ్రీనివాసరావు
కమిటీ చైర్మన్ పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఎస్పీ యాక్సిడెంట్స్ డేటాను పరిశీలించి ప్రమాదాల నివారణకు పలు సూచనలు చేశారు.
గుర్తించిన బ్లాక్ స్పాట్లలో సంబంధిత డిపార్ట్మెంట్ అధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలని సూచించారు.
సంబంధిత శాఖలైనటువంటి రెవిన్యూ, రవాణా,ఆర్. అండ్. బి, నేషనల్ హైవేస్ మరియు ఆరోగ్య శాఖలు పోలీసు శాఖతో సమన్వయం తో పనిచేయాలని ఆయన సూచించారు.
ద్విచక్ర వాహనాలు నడిపేవారు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నారని ,ఫోన్ మాట్లాడుతు డ్రైవ్ చేసేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలని,
ద్విచక్ర వాహనాలు నడిపే వారు హెల్మెట్ ధరించేలా చూడాలని ఎస్పీ కే. శ్రీనివాసరావు తెలిపారు.
ఎస్పీ మాట్లాడుతూ యూ టర్న్స్ దగ్గర సైన్ బోర్డులు, రేడియం స్టిక్కర్లు పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
రొంపిచర్ల వద్ద ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఎన్.ఏ.ఎం. హైవే పై ఫ్లైఓవర్ నిర్మాణానికి అవకాశాలను పరిశీలించాలని ఇంజినీరింగ్ అధికారులను జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు కొరారు.
అనంతరం నోడల్ అధికారి
E -DAR యాప్ పైన అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో పాటు జిల్లా రవాణా శాఖ అధికారి వి.సంజీవ కుమార్,ఆర్.అండ్.బి ఈ, ఈ.ఈ,ఆర్టీసీ ఆర్.ఎం,
ఎన్.హెచ్.ఐ అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.