నారద వర్తమాన సమాచారం
టీచరుగా మారిన పల్నాడు జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు
పల్నాడు జిల్లా
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం పల్నాడు జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు పర్యటించారు.
పాఠశాల మొత్తం కలియ తిరిగి విద్యార్థులందరితో ఆప్యాయంగా పలకరించి వారితో ముచ్చటించారు.
విద్యార్థినీ, విద్యార్థులను ప్రశ్నించి వారిలో నూతన ఉత్సాహాన్ని నింపి, వారితో టీచర్ గా మారి పల్నాడు జిల్లా కలెక్టర్ ప్రశ్నలు సంధించి వారి వద్ద నుండి సమాధానాలు రాబట్టారు.
అనంతరం విద్యార్థినీ, విద్యార్థులు పాఠశాలలో పలు ప్రశ్నలు వేసి టీచరు గా వారిని ఉత్సాహ పరిచారు.
అక్కడ నుండి విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనాన్ని వడ్డించారు.
ఈ కార్యక్రమం లో జిల్లా విద్యా శాఖ అధికారిని చంద్రకళ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి బి. రవి, పిడుగురాళ్ల స్పెషల్ ఆఫీసర్ ఆంజనేయులు, ఆర్డిఓ మురళీకృష్ణ, స్థానిక తహశీల్దార్,స్థానిక పాఠశాల ప్రధానోపా ధ్యాయులు,ఉపాధ్యా యులు,పిడుగురాళ్ల వైద్య ఆరోగ్య సిబ్బంది,విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.