నారద వర్తమాన సమాచారం
బంజారాహిల్స్ పెద్దమ్మ గుడి కూల్చివేతపై హైకోర్టు కీలక ఆదేశాలు..!!
బంజారాహిల్స్ పెద్దమ్మ గుడి కూల్చివేతపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రోడ్ నెం. 12 పెద్దమ్మ గుడి కూల్చివేతపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది.
ఈ విచారణ సందర్భంగా పెద్దమ్మ తల్లి విగ్రహాన్ని జాగ్రత్తగా భద్రపర్చాలని అధికారులకు హైకోర్టు ఆదేశించింది. పెద్దమ్మ తల్లి విగ్రహం కూల్చివేతపై పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈరోజు నెల 18కు వాయిదా వేసింది.
కొన్ని రోజుల క్రితం అధికారులు బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లో ఉన్న పెద్దమ్మ తల్లి ఆలయాన్ని కూల్చి వేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై ఇక్కడి స్థానికులు, హిందూ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేశాయి. దీనిలో భాగంగానే ఇటీవల కుంకుమార్చాన పూజకు పిలుపునివ్వడంతో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో ముందే అప్రమత్తమైన పోలీసులు.. ముందు జాగ్రత్తగా పెద్దమ్మ తల్లి ఆలయం దగ్గరగా భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. గతంలో ఈ అంశంపై బండి సంజయ్ సైతం స్పందించారు. తెలంగాణలో బోనాల పండుగ సందర్భంగా బంజారాహిల్స్‌లోని పెద్దమ్మ గుడిని కూల్చడం పట్ల కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనను దారుణమైన చర్యగా అభివర్ణిస్తూ, దీని వెనుక రాజకీయ కుట్ర ఉందని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఒక వర్గం ఓట్లను సంపాదించేందుకు కాంగ్రెస్ ఈ చర్యకు పాల్పడిందని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల విషయంలో తీవ్ర విమర్శలు చేశారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.