నారద వర్తమాన సమాచారం
ప్రభుత్వ పాఠశాలల్లో సైయెంట్’ భాగస్వామ్యం తో ఏఐ ల్యాబ్ లు :లాంఛనంగా ప్రారంభించిన మంత్రి నారా లోకేష్
విశాఖ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏ ఐ ) ల్యాబ్ ల ఏర్పాటులో సైయెంట్ ఫౌండేషన్ కృషి అభినందనీయమని రాష్ట్ర మానవ వ వనరులు ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఋషికొండ సమీపంలో గల రాడిసన్ బ్లూ హోటల్లో శుక్రవారం మధ్యాన్నం ఈ కార్యక్రమాన్ని లాంచనంగా ప్రారంభించారు. సైయెంట్ వ్యవస్థాపకులు చైర్మన్ డాక్టర్ బి.వి.ఆర్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో విద్యార్థులు, అధ్యాపకుల సమక్షంలో ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ప్రపంచంలో సాంకేతికతలో పోటీపడుతున్న భారత్ ఆంధ్రప్రదేశ్ నుంచి టెక్నాలజీ రంగంలో నిష్ణాతులైన వారిని తీర్చిదిద్దేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో భవిష్యత్ లో విస్తరిస్తామన్నారు. ఐటీ పరిశ్రమల కేంద్రంగా విశాఖలో అనేక సంస్థలు ఏర్పాటు అవుతున్న తరుణంలో ప్రస్తుత యుగానికి అవసరమైన 21వ శతాబ్దపు పోటీ తత్వాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ పాఠశాలల పేద విద్యార్థులకు ఏఐ
Discover more from
Subscribe to get the latest posts sent to your email.