నారద వర్తమాన సమాచారం
గుంటూరు పశ్చిమ నియోజకవర్గములో నూతన సబ్ స్టేషన్ల ఏర్పాటు కోసం విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కి వినతిపత్రం అందజేసిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి
3 సబ్ స్టేషన్లు మంజూరు చేసిన మంత్రి గొట్టిపాటి రవి గారు.
త్వరితగతిన 2 సబ్ స్టేషన్ల పనులు ప్రారంభించాలని కోరిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కొత్తగా మూడు(3) , 33/11KV సబ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి ని కోరారు. మంగళవారం ఆయనను మర్యాదపూర్వకంగా కలసి సబ్ స్టేషన్ల ఏర్పాటు కోసం వినతిపత్రం అందజేశారు. అదే విధంగా APCPDCL CMD పుల్లారెడ్డి ని కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మంత్రి గొట్టిపాటి రవి తో మాట్లాడుతూ… గుంటూరులో విద్యుత్ డిమాండ్ రోజు రోజుకీ పెరుగుతోందని, వేసవి కాలంలో 11KV ఫీడర్లు ఓవర్ లోడ్ అవ్వడం వల్ల తక్కువ వోల్టేజ్ సమస్యలు వస్తున్నాయని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. రాజధాని సమీపంలో ఉన్న గుంటూరు నగరం వేగంగా విస్తరిస్తోందని, భవిష్యత్తులో మరింత డిమాండ్ పెరగబోతోందని దృష్టిలో పెట్టుకొని 24 గంటలు నిరంతరాయంగా మంచి వోల్టేజ్ తో కరెంట్ సరఫరా అందించాలంటే కొత్త సబ్ స్టేషన్లు అత్యవసరమని తెలిపారు. కాబట్టి A.T. అగ్రహారం, Z.P.కాంపౌండ్, సంపత్ నగర్ సబ్ స్టేషన్లు మంజూరు చేయాలని కోరగా, వెంటనే మంత్రి గొట్టిపాటి రవి సబ్ స్టేషన్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. అయితే లో ఓల్టేజి సమస్య దృష్ట్యా, రెండు సబ్ స్టేషన్ పనులు వెంటనే ప్రారంభించాలని ఎమ్మెల్యే గళ్ళా మాధవి కోరగా, మంత్రి గొట్టిపాటి రవి సానుకూలంగా స్పందించి తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సబ్ స్టేషన్లు పూర్తికావడం ద్వారా గుంటూరు పశ్చిమలో వోల్టేజ్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, ప్రజలకు 24×7 నాణ్యమైన విద్యుత్ సరఫరా అందుతుందని ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆశాభావం వ్యక్తం చేశారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







