నారద వర్తమాన సమాచారం
సబ్ జైలు ను ఆకస్మికంగా తనిఖీ చేసిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపీఎస్ మరియు కలెక్టర్ పి.అరుణ్ బాబు
ఈ రోజు ఉదయం 11 గంటలకు నరసరావు పేట లోని స్థానిక సబ్ జైలు ను పల్నాడు జిల్లా ఎస్పీ , జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
జైలు భద్రతా చర్యలు, ఖైదీల సంక్షేమానికి సంబంధించిన సదుపాయాలను వారు పరిశీలించారు.
ఖైదీలతో ముచ్చటించి జైల్లో వసతులు, మెనూ ప్రకారం భోజనం అందించడం పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సబ్ జైలు అధికారులు ఖైదీల హక్కులకు భంగం వాటిల్లకుండా మసలుకోవాలన్నారు. ఖైదీలు సత్ప్రవర్తనవైపు నడిచేలా జైల్లో కార్యక్రమాలు నిర్వహించాలని, జైలు జీవితం అనంతరం మంచి ఉపాధి పొందేలా నైపుణ్య శిక్షణ అందించాలన్నారు.
జైలు సిబ్బందికి తగిన సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో ఎస్పి కలెక్టర్ తో పాటు నరసరావుపేట RDO
మధులత నరసరావుపేట ఎమ్మార్వో సబ్ జైలు జైలర్ పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.