నారద వర్తమాన సమాచారం
వీరనాట్యం కళాకారులను ప్రభుత్వం గుర్తించండి : గురజాల అప్పారావు
మాచర్ల :
వీరనాట్యం కళాకారులను ప్రభుత్వం గుర్తించాలి అలాగే కవులు, రచయితలు, వీరనాట్యం కళాకారుల కళను గుర్తించి ప్రభుత్వం గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని శ్రీ వీరబ్రహ్మేంద్ర జాతీయ ప్రజా హక్కుల పరిరక్షణా సమితి అధ్యక్షులు గురజాల అప్పారావు అన్నారు. ఈ సందర్భంగా గురువారం గురజాల అప్పారావు మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నుండి కవులు, రచయితలు, వీర నాట్యం కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించి సమాజ మార్పు కోసం కృషి చేస్తున్నారన్నారు. తమ తమ కళలను నమ్ముకొని జీవనం సాగిస్తున్న వారిని ప్రభుత్వం గుర్తించి జీవోను జారీ చేయాలన్నారు. తద్వారా వారి జీవనోపాధికి లబ్ధి చేకూరేలా ప్రభుత్వం ముందడుగు వేయాలన్నారు. ప్రతి శుభకార్యానికి ముందుగా వీరనాట్య కళాకారులచే వీరనాట్యంతో, బియ్యం కొలన ఒంటి కళను ప్రదర్శింపజేయడం పూర్వం నుండి వస్తున్న సాంప్రదాయం అన్నారు. విషయాన్ని ఇటీవల జరిగిన విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం నాడు పలనాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేసినట్లు ఆయన పేర్కొన్నారు. వినతి పత్రం అందజేసిన వారిలో ప్రజాసేవా రత్న అవార్డు గ్రహీత డాక్టర్ బెజ్జంకి జగన్నాథాచార్యులు, విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు సుతారం వాసు తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







