Thursday, October 30, 2025

జాబ్ మేళా గోడ పత్రిక ఆవిష్కరించిన పల్నాడు జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా

నారద వర్తమాన సమాచారం

జాబ్ మేళా గోడ పత్రిక ఆవిష్కరించిన పల్నాడు జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా

పల్నాడు: నరసరావుపేట

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్ద ఆధ్వర్యంలో జాబ్ మేళాను ఈ నెల ది:29-10-2025 (బుధవారం) వ తేదిన ఉ. 09.గం//లకు ఈశ్వర్ ఇంజనీరింగ్ కళాశాల, కేసనపల్లి, నరసరావుపేట, పల్నాడు జిల్లా నందు జాబ్ మేళ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

జాబ్ మేళా యొక్క గోడ పత్రికను డా. కృతిక శుక్ల ఐఏఎస్, కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ కలెక్టర్ కార్యలయం నందు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ పల్నాడు జిల్లా మరియు పరిసర ప్రాంత యువతి యువకులు అందరూ ఈ జాబ్ మేళాలో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనవలసిందిగా తెలియజేశారు. ఈ జాబ్ మేళాకు సుమారు 30 కి పైగా బహుళ జాత కంపెనీలు పాల్గొంటున్నాయి. ఉదాహరణకు టెక్ మహేంద్ర, వి చేంజ్ సోలుషన్స్, ఫ్యూచర్ ఐ టీ సోలుషన్స్, ఆక్సిస్ బ్యాంక్, ఆపేక్స్ సొల్యూషన్, బి.ఎస్.సి.పీ.యల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, కియా మోటార్స్ మరియు హెట్రో డ్రగ్స్ వంటి పలు రకాల కంపెనీలు హాజరవుతున్నాయి అని తెలియజేసారు. జీతం వారి విద్యార్హతను బట్టి సుమారు 12,000 – 40,000 రూపాయల వరకు ఉండవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమనికి పల్నాడు జిల్లా నైపుణ్యాభివృద్ది అధికారి ఈ. తమ్మాజి రావు రామాంజినేయులు, రవీంద్ర నాయక్ మరియు ఈశ్వర్ ఇంజనీరింగ్ కళాశాల కర్రెస్పొండెంట్ అబ్దుల్ కరీమ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ జాబ్ డ్రైవ్ కు ఎస్‌.ఎస్‌.సి, ఇంటర్, ఐటియఐ, డిగ్రీ, బి.టేక్, డిప్లొమా, ఫార్మసి, మరియు పి.జి విభాగముల వరకు చదువుకున్నటు వంటి 18-35 సం.ల వయసు గల నిరుద్యోగ యువతి యువకులు వారి యొక్క బయోడేటా లేదా రెస్యూమ్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ జిరాక్స్, ఆధార్ నకలు మరియు పాస్ పోర్ట్ ఫోటో తో నేరుగా ఇంటర్వ్యూ కు హాజరు కాగలరు.

చిరునామా: తేదీ :- 21-05-2025
సమయ :- ఉదయం 9:00 నుండి సాయంత్రం 04:00 వరకు ఇంటర్వూలు జరుగును.
స్థలం:- ఈశ్వర్ ఇంజనీరింగ్ కళాశాల, కేసనపల్లి, నరసరావుపేట, పల్నాడు జిల్లా
సంప్రదించవలసిన నంబర్లు: 9160200652, 9642194600, 9573247861,8121360425, 9100566581, 7702921219.
ఔత్సాహిక యువతి యువకులు ముందుగా https://naipunyam.ap.gov.in/user-registration అనే వెబ్ సైట్ నందు రిజిస్టర్ చేసుకోగలరు. మరిన్ని వివరములకు పైన తెలిపిన నంబర్లను సంప్రదించగలరు.
గమనిక: రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోనటువంటి యువతీ యువకులు జాబ్ డ్రైవ్ జరుగు ప్రదేశం నందు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని గమనించగలరు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading