నారద వర్తమాన సమాచారం
త్రాగునీటి పారిశుద్ధ్య వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ను త్వరగాపూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ కృతిక శుక్ల
జిల్లా తాగునీటి మరియు పారిశుధ్య మిషన్ కమిటీ నందు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు అనుమతులు త్వరిత గతిని పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా దిశ నిర్దేశం చేశారు
జల జీవన్ మిషన్, స్వచ్ఛభారత్ మిషన్ గ్రామీణ, డిస్టిక్ ఆఫ్ నీటి విడుదల,శానిటేషన్ మిషన్ పనులపై సమీక్ష సమావేశం జరిగింది.
రూరల్ వాటర్ సప్లై డిపార్ట్ మెంట్ మిషన్ పై జిల్లా కలెక్టర్ సమీక్షలో పలు సూచనలు చేశారు.
జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా అధ్యక్షతన మూడవ జిల్లా తాగునీటి మరియు పారిశుధ్య మిషన్ కమిటీ మీటింగ్ కలెక్టరేట్ నందు ఎస్.ఆర్. శంకరన్ హాల్ నందు నిర్వహించడం,పి. పి.టి మోడ్ లో వివరిం చడం జరిగింది.
ఈ సమావేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికి ఈ పథకం ద్వారా తాగునీటి కనెక్షన్ ఇప్పించాలని, తాగు నీరు ఉన్న కనెక్షన్లు వదిలి, ఇంకా కావలసిన నీటిని కనెక్షన్లు ఇప్పిం చాలని పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా ఆదేశించారు.
సమావేశంలో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు యొక్క పర్మిషన్స్ పై సమీక్షించడం జరిగింది. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు కొరకు వాటర్ డ్రాయల్ లో భాగం గా 1.865 టిఎంసి నీటిని కేటాయించుటకు నిర్ణయం తీసుకోవలసిందిగా కోరారు.
ఈ ప్రాజెక్టుకు వాటర్ డ్రాయల్ పర్మిషన్ లో భాగంగా 1.865 టిఎంసి నీటిని కేటాయించుటకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారితో సమన్వయం చేసుకొని సేవింగ్స్ చూపెట్టి నాగార్జునసాగర్ ప్రాజెక్టు కింద ఆంధ్ర ప్రదేశ్ కేటాయించిన 132 టీఎంసీలలో పర్మిషన్ ఇప్పించవలసిందిగా మార్గదర్శనం చేశారు.
అలాగే స్టేట్ హైవేస్, ఫారెస్ట్, బ్లాస్టింగ్, పర్మిషన్స్ మీద రివ్యూ చేసినారు ఈ సమావేశమునకు జడ్పీ సీ.ఈ.ఓ జ్యోతిబసు, జిల్లా గ్రామీణ నీటి సరపర ఇంజనీరింగ్ అధికారి ఇంజనీరింగ్ అధికారి చంద్రశేఖర్, డి.పి.ఓ నాగేశ్వరరావు నాయక్, జిల్లా విద్య శాఖ అధికారిని చంద్రకళ,డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్, గ్రౌండ్ వాటర్ అధికారి రామ్ బాలాజీ రెడ్డి, జాయింట్ డైరెక్టర్ వ్యవసాయ శాఖ ఏం జగ్గారావు,జిల్లా ఆర్. అండ్.బి అధికారిని గీతారాణి, జిల్లా అగ్నిమాపక దళ అధికారి శ్రీధర్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఆఫీసర్ ముత్తయ్య హాజరయ్యారు.
మంచి నీటి నాణ్యత పరిశీలన
సమావేశానంతరం నరసరావుపేట మండల పరిధిలో మహిళల చేత త్రాగునీటి నాణ్యత పరీక్షలపై కలెక్టర్ కు ప్రజెంటేషన్ ఇప్పించినారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







