కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న బిఆర్ఎస్ ముఖ్య నాయకుడు
పాములపాడు బిఆర్ఎస్ ముఖ్య నాయకుడు తండు సైదులు గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక
పాములపాడు గ్రామంలో ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు బిఆర్ఎస్ పార్టీలో చేరలేదు. కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు సబ్బు హరికృష్ణ రెడ్డి
మిర్యాలగూడ నారద వర్తమాన సమాచారం
ప్రతినిధి:శంకర్
మిర్యాలగూడ నియోజకవర్గం మాడుగులపల్లి మండలం, పాములపహాడ్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ ముఖ్య నాయకుడు గౌడ సంఘం మాజీ అధ్యక్షుడు తండు సైదులు గౌడ్ శుక్రవారం కాంగ్రెస్స్ పార్టీలో చేరడం జరిగింది తండు సైదులు గౌడ్ మాట్లాడుతూ 10 సంవత్సరాలు నమ్ముకున్న వారి కోసం పార్టీ కోసం పనిచేశాము కానీ మాకు ఎటువంటి పథకాలు రాలేదు బీసీ బిడ్డ అయిన నాకు గత మా ప్రభుత్వంలో పథకాలు కూడా రాకుండా చేశారు కావున కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ముగ్ధుడినై ఈరోజు పార్టీలో చేరడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సబ్బు హరికృష్ణారెడ్డి , మాట్లాడుతూ కాంగ్రెస్ గ్రామ శాఖ మాజీ అధ్యక్షుడు సత్తిరెడ్డికి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. అతని వెంట కాంగ్రెస్ పార్టీ ఒక కార్యకర్త కూడా టిఆర్ఎస్ పార్టీలో చేరలేదు. కావున బిఆర్ఎస్ నాయకులు తప్పుడు మాటలు మానుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు మాండ్ర గిరి యాదవ్ , మాజీ సర్పంచ్ పోలిశెట్టి ఉపేందర్ ,ప్రధాన కార్యదర్శి మామిడి సైదులు ,సీనియర్ నాయకులు జెర్రిపోతుల లింగయ్య , కునుకుంట్ల జానయ్య , రెండవ వార్డ్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి దామెర్ల అశోక్ , సిపిఎం సీనియర్ నాయకులు బంటు రామచంద్రు మరియు కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు ఈసారపు సత్తెమ్మ పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







