రిజర్వేషన్ల విషయంలో బీసీలకు అన్యాయం జరిగిందంటూ సాయి ఈశ్వర చారి ఆత్మ బలిదానం చేసుకోవడం బాధాకరం
సాయి ఈశ్వర చారి మరణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలి
మిర్యాలగూడ నారద వర్తమాన సమాచార
ప్రతినిధి :శంకర్
ఈశ్వర చారి కుటుంబానికి కోటి రూపాయలు ఆర్థిక సాయం అందించాలి……బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగంగౌడ్ డిమాండ్
రిజర్వేషన్ల విషయంలో బీసీలకు అన్యాయం జరిగిందంటూ హైదరాబాదులో పెట్రోల్ పోసుకొని సాయి ఈశ్వర చారి ఆత్మబలిదానం చేసుకోవడం చాలా బాధాకరమైన సంఘటన అని బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగంగౌడ్ అన్నారు.సాయి ఈశ్వర చారి చిత్రపటానికి అమరవీరుల స్థూపం వద్ద బీసీ ఐకాస ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగంగౌడ్ మాట్లాడుతూ బీసీలు హక్కుల కోసం ఉద్యమించాలి కానీ మనస్తాపం చెంది ఈ విధంగా ఆత్మహత్యలకు పాల్పడడం సరికాదన్నారు.యువత సమాజానికి ఎంతో అవసరమన్నారు.సాయి ఈశ్వర చారి మృతికి బిజెపి కాంగ్రెస్ పార్టీలే బాధ్యత వహించాలి. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగివచ్చి సర్పంచ్ ఎన్నికలను వాయిదా వేయాలి.ముమ్మాటికీ ఇది కాంగ్రెస్ బిజెపిలు చేసిన హత్యే. కాంగ్రెస్ బిజెపి పార్టీలో ఉన్న బీసీ నాయకులు ఎమ్మెల్యే , ఎంపీలు మీ పదవులకు రాజీనామా చేయాలి. సాయి ఈశ్వర చారి కుటుంబానికి కోటి రూపాయల ఆర్థిక సాయం చేయాలి. ఈ కార్యక్రమంలో బంటు వెంకటేశ్వర్లు ఎర్రబెల్లి దుర్గయ్య బంటు కవిత దోనేటి అశోక్ చిత్రం ఉమ ఈశ్వర చారి
రమేష్ ప్రభంజన్ మధు నరేష్ రాంబాబు శ్రీనివాస్ లక్ష్మణ్ హరీష్ శివ సందీప్ తదితరులు పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







