నారద వర్తమాన సమాచారం :ప్రతినిధి
కూటమి ప్రభుత్వం రాగానే పిరమలై కల్లర్ కులస్థులకు న్యాయం: ప్రత్తిపాటి
పిరమలై కల్లర్ కులస్థఉల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ప్రత్తిపాటి, లావు
ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం రాగానే పిరమలై కల్లర్ కులస్థులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు. నర్స రావు పేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. రాష్ట్రంలో లక్షకు పైగా ఉన్న వారందరి 80 ఏళ్ల ఎదురుచూపులకు పరిష్కారం చూపించి తీరతామన్నారు వారిద్దరు. సోమవారం చిలకలూరిపేట వివేకానంద కాంప్లెక్స్‌లో జరిగిన పిరమలై కల్లర్ కులస్థులతో ఆత్మీయసమావేశంలో ప్రత్తిపాటి పుల్లారావు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొదటమాట్లాడిన వారంతా తమిళనాడు నుంచి వచ్చి రాష్ట్రంలో సుమారు 80 ఏళ్లుగా నివసిస్తున్నా ఎలాంటి గుర్తింపు లేదని, ఏపీ ప్రభుత్వం తమకు కుల ధ్రువీకరణ పత్రాలు కూడా మంజూరు చేయడం లేదని ప్రత్తిపాటి, లావు దృష్టికి తీసుకెళ్లారు. పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలన్న, ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేసుకోవాలన్న గుర్తింపు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. రాష్ట్రంలో లక్షకుపైగా తమ కులస్థులు ఉన్నారని, తమిళనాడులో డీ నోటిఫైడ్ ట్రైబ్స్‌గా, కేంద్ర ప్రభుత్వం ఓబీసీలుగా గుర్తించిందని.. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లో గుర్తించి తమ కులాన్ని సముచితమైన కేటగిరీలో చేర్చాలని కోరారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడుతూ పిరమలై కల్లర్ కులస్థులను న్యాయమైన డిమాండ్‌ను ఎంపీ లావు ద్వారా కేంద్రం దృష్టికి తీసుకుని వెళ్లడంతో పాటు చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే రాష్ట్ర ప్రభుత్వం తరఫున పరిష్కారమయ్యేలా చూస్తామన్నారు. ప్రస్తుతం వారంతా ధ్రువపత్రాలు రాక చాలా ఇబ్బందులు పడుతున్నారని, పథకాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ రాక అనేక ఇబ్బందులు పడుతున్నారని ప్రత్తిపాటి తెలిపారు. రాబోయే కూటమి ప్రభుత్వంలో తప్పకుండా న్యాయం చేస్తామన్నారు. పిరమైల్ కల్లర్ కులస్థులు అంతా తెలుగుదేశం కూటమికి మద్దతు తెలపాలని కోరారు. అధికారంలోకి రాగానే వారి సమస్యలను పరిష్కరించే శక్తి తమకు ఉందన్నారు. అనంతరం మాట్లాడిన ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు కేంద్రం ద్వారా వేగంగా వారి డిమాండ్‌ను పరిష్కారమయ్యేందుకు కృషి చేస్తానని మాట ఇచ్చారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.