నారద వర్తమాన సమాచారం
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పల్నాడు జిల్లా శాఖ ఆధునికరించిన భవనాన్ని మరియు జనరిక్ మెడికల్ షాపును ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతిక శుక్ల ఐఏఎస్
ఈరోజు పల్నాడు జిల్లా నరసరావుపేట రెడ్ క్రాస్ సొసైటీ ఆధునికరించిన భవనం యొక్క ప్రారంభోత్సవం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ మరియు రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ డాక్టర్ హృతిక శుక్ల ఐఏఎస్ హాజరైనారు.
ముందుగా జనరిక్ మెడికల్ షాప్ మరియు ఆధునికరించిన రెడ్ క్రాస్ భవనాన్ని ప్రారంభోత్సవం చేశారు.
జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ ఎం ఆర్ శేషగిరిరావు మాట్లాడుతూ రెడ్ క్రాస్ సొసైటీ పల్నాడు జిల్లా ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలను చేసామని అదే విధంగా రాబోయే 2026 సంవత్సరంలో తలసీమియా ట్రాన్స్ ఫ్యూజన్, కార్నియా కలెక్షన్ సెంటర్, మరియు మీ ఇంటికి మీ డాక్టర్ అనే కార్యక్రమాలను చేపట్టబోతున్నామని ఈ కార్యక్రమాలకు జిల్లా కలెక్టర్ సహకారం మరియు నరసరావుపేట ప్రజల యొక్క సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరారు.
ముఖ్య అతిధి జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతిక శుక్లా మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన రెడ్ క్రాస్ కార్యవర్గం వచ్చిన తక్కువ కాలంలోనే రెడ్ క్రాస్ యొక్క భవనాన్ని ఆధునికరించడం చాలా మంచి విషయం అని రెడ్ క్రాస్ ద్వారా అనేక కార్యక్రమాలు చేయొచ్చునని పర్సనల్గా తాను కాకినాడ జిల్లా కలెక్టర్గా పని చేసిన కాలంలో కాకినాడ రెడ్ క్రాస్ లో తల సేమియా ట్రాన్స్ఫ్యూజన్ సెంటర్, కార్నియా కలెక్షన్ సెంటర్, జనరిక్ మెడికల్ షాప్, స్త్రీలకు ఉపాధి కల్పన వంటి సేవలకు గవర్నర్ గారి నుండి రెండుసార్లు అవార్డు అందుకోవడం జరిగిందని అదేవిధంగా మనకు నూతనంగా ఏర్పడిన పలనాడు జిల్లాలో కూడా రెడ్ క్రాస్ ద్వారా అనేక కొత్త ప్రాజెక్టులను ఇంప్లిమెంట్ చేయాలని దానిలో భాగంగానే రాబోవు కాలంలో తలసీమియా ట్రాన్స్ ఫ్యూజన్ సెంటర్ , మీ ఇంటికి మీ డాక్టర్, కాన్య కలెక్షన్ అనే ప్రాజెక్టులను పల్నాడు రెడ్ క్రాస్ సొసైటీ చేపట్టబోతుందని అందుకు రెడ్ క్రాస్ వారికి అభినందనలు తెలియజేశారు.
రెడ్ క్రాస్ ను బలోపేతం చేయాలంటే దానికి రెడ్ క్రాస్ లైఫ్ మెంబర్స్ మరియు జిల్లా ప్రజానీకం యొక్క సపోర్ట్ వారి యొక్క సలహాలు సూచనలు చాలా అవసరమని తెలియజేశారు.
భవిష్యత్తులో మీరు చేపట్టబోయే కార్యక్రమాలకు జిల్లా అడ్మినిస్ట్రేషన్ యొక్క సహాయ సహకారాలు ఉంటాయని అదే విధంగా సి. ఎస్. ఆర్ ఫండ్స్ ద్వారా అవకాశం ఉన్నంత మేరకు సహకారం అందిస్తామని తెలియజేశారు.
అలాగే జిల్లాలో ప్రతి కాలేజీ మరియు స్కూల్లో జూనియర్ రెడ్ క్రాస్, యూత్ రెడ్ క్రాస్ స్థాపించి పిల్లలకు చిన్న వయసు నుంచే సేవా దృక్పథం అలవాటు చేయాలని సూచించారు .
ఈ కార్యక్రమాలన్నిటికి భవిష్యత్తులో నెరవేర్చాలని రెడ్ క్రాస్ కమిటీకి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్ కె మధులత జిల్లా చైర్మన్ ఎంఆర్ శేషగిరిరావు వైస్ చైర్మన్ గుప్తా ట్రెజరర్ డాక్టర్ నంద్యాల రామప్రసాద్ రెడ్డి మేనేజింగ్ కమిటీ మెంబర్స్ డాక్టర్ కంజుల జగన్మోహన్ రెడ్డి డాక్టర్ సార్పం రామ్ ప్రసాద్ డాక్టర్ సృజనా , బత్తుల మురళి లైఫ్ మెంబర్స్, యూత్ రెడ్ క్రాస్ మరియు జూనియర్ రెడ్ క్రాస్ వాలంటీర్స్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







