నారధ వర్తమాన సమాచారం
మాచర్ల విద్యుత్ ఈ ఈ సింగయ్య వినియోగదారులకు సలహాలు సూచనలు ….
దాచేపల్లి సబ్ డివిజన్, విద్యుత్ రెవెన్యూ కార్యాలయాన్ని మాచర్ల డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ( ఆపరేషన్ )ఎన్. సింగయ్య మంగళవారం సందర్శించి ఉన్నత అధికారులతో సమావేశం జరిపారు. ఈ సందర్భంగా విద్యుత్ వినియోగదారులకు ముఖ్యమైన సూచనలు చేశారు. పారిశ్రామిక విద్యుత్ వినియోగదారులు సకాలంలో బిల్లులు చెల్లించి అనగా బిల్లు ఇచ్చిన తేదీ నుండి 14 రోజుల ముందే బిల్లును చెల్లించి అపరాధ రుసుము లేకుండా చేయాలన్నారు. ప్రభుత్వం కల్పించిన అడిషనల్ లోడ్ స్కీమ్ 31. 12.2025 బుధవారం ముగుస్తున్నందున వినియోగదారులందరూ ఈ స్కీం కింద అడిషనల్ లో రెగ్యులరైజేషన్ 50 శాతం డబ్బు ఆదా తో చేసుకోగలరని తెలియజేశారు.అలాగే పి ఎం సూర్య ఘర్ సోలార్ ప్యానల్స్ ను వినియోగదారులందరూ ఏర్పాటు చేసుకుని వినియోగదారునికి వచ్చే బిల్లును కూడా తగ్గించుకొనగలరని తెలియజేశారు.
అధిక రేటింగ్ ఉన్న ఎలక్ట్రికల్ పరికరాలు వాడడం వలన విద్యుత్ పొదుపు అవుతుందని ఒక యూనిట్ విద్యుత్తు పొదుపు చేస్తే రెండు యూనిట్ల ఉత్పత్తికి సమానంగా ఉంటుందని దీనిని గమనించాలని వినియోగదారులకు తెలియజేశారు. విద్యుత్ వైర్లు, లైన్ లు, పోల్స్ గాని ప్రమాదంలో ఉన్న యెడల సంబంధిత అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ లేదా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ కు దృష్టికి తీసుకురావాలన్నారు. విద్యుత్ ప్రమాదం నుండి తప్పించుకోవాలని వినియోగదారులందరికీ విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ అకౌంట్ అధికారి పి. సందీప్ కుమార్, పిడుగురాళ్ల & దాచేపల్లి , అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భూక్య భగవాన్ నాయక్, డీ ఈఈ తుమ్మర వీరేశ్వర రావు, దాచేపల్లి సబ్ డివిజన్, ఈ ఆర్ ఓ, ఆపరేషన్ విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







