ఘనంగా సాప్ మెడికల్ చైర్మన్ డాక్టర్ నియాజ్ ఖాన్ జన్మదిన వేడుకలు
మిర్యాలగూడ
నారద వర్తమాన సమాచారం
మిర్యాలగూడలో ఏరియా హాస్పిటల్ లోని డయాలసిస్ సెంటర్లో సాప్ మెడికల్ డైరెక్టర్ & చైర్మన్ డాక్టర్ నియాజ్ ఖాన్ జన్మదిన వేడుకలను సెంటర్ ఇంచార్జి పాల్వాయి రాంబాబు, స్టాప్ నడుమ కేక్ కట్ చేసి ఫ్రూట్స్, బ్రెడ్లు పేషెంట్లకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఇంచార్జ్ రాంబాబు మాట్లాడుతూ నియాజ్ ఖాన్ జన్మదినం అంటే పండుగ లాంటిది ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టెక్నీషియన్స్ శోభన్, పాండు, శిరీష,అలేఖ్య మధు, మంజు, వేణు,సెంటర్ ఎగ్జిక్యూటివ్స్ షఫీ, షకీల్ తదితరులు పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







