నారద వర్తమాన సమాచారం
కన్స్యూమర్ గ్రీవెన్స్ రెడ్రస్సుల్ ఫోరం ఆధ్వర్యంలో విద్యుత్ లో పదాలత్ అవగాహన సదస్సు
కన్స్యూమర్ గ్రీవెన్సెస్ రెడ్రెస్సల్ ఫోరం (సీజీఆర్ఎఫ్) విజయవాడ వారి అధ్వర్యంలో విద్యుత్ ఆదాలత్, అవగాహన సదస్సు ఈ నెల 8 న పిడుగురాళ్ల లో నిర్వహించినట్లుగా మాచర్ల ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ యన్. సింగయ్య తెలిపారు. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ విద్యుత్ వారి కార్యాలయo (కొండమోడు) ప్రాంగణములో జరిగిన ఈ కార్యక్రమము ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 01.30 గంటల వరకు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమములో విజయవాడ నుండి వచ్చిన సీజీఆర్ఎఫ్ చైర్మన్ .ఎన్.విక్టర్ ఇమ్మానుయేల్ మరియు ఫోరం సభ్యులు పాల్గొన్నారు.
సీజీఆర్ఎఫ్ చైర్మన్ ఎన్.విక్టర్ ఇమ్మానుయేల్ మాట్లాడుతూ వినియోగ దారులు విద్యుత్ శాఖ నిబందనలు తెలుసుకొని అవగాహన కల్పించుకొని విద్యుత్ వాడుకొన్నట్లయితే ఎటువంటి సమస్యలు ఉండవని చెప్పారు. క్యాటగిరి 2 మరియు కేటగిరి 3 వినియోగదారులకు స్మార్ట్ మీటర్లు బిగించినందున వారు తప్పనిసరిగా కెపాసిటర్లను బిగించుకొని విద్యుత్తును వాడినట్లయితే పెనాల్టీ నుండి తప్పించుకొనవచ్చని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే విద్యుత్ శాఖ సిబ్బంది బాధ్యతాయుతంగా పని చేయకపోవడం వల్ల వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారని దానిపై దృష్టి సారించి అటువంటి వారిపై కూడా తగిన చర్యలు తీసుకొనటానికి ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తామని తెలిపారు. మాచర్ల డివిజన్ లోని 12 మంది విద్యుత్ వినియోగదారులు తమ ఫిర్యాదులను వ్రాత పూర్వకముగా అర్జీ ఇచ్చి సమస్యలను పరిష్కరించుకొన్నారు. విద్యుత్ అంతరాయలు, హెచ్చు తగ్గులు, మీటరు సమస్యలు, బిల్లుల సమస్యలు, విద్యుత్ సరఫరాకు సంబంధించిన అన్నీ సమస్యలు కలపి 12 రాగా 12 సమస్యలను వెంటనే పరిష్కరించారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా సూపరింటెండింగ్ ఇంజనీర్ డా” P. విజయకుమార్ మరియు, బి వెంకటేశ్వరరావు సీనియర్ ఎకౌంట్స్ ఆఫీసర్ పలనాడు జిల్లా, పిడుగురాళ్ల డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వడితే లక్ష్మా నాయక్, పి సందీప్ కుమార్ అసిస్టెంట్ ఎకౌంట్స్ ఆఫీసర్ పిడుగురాళ్ల మరియు డివిజన్ లోని అందరూ అసిస్టెంట్ ఇంజనీర్లు విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఈ అవకాశాన్ని ఎక్కువ మంది విద్యుత్ వినియోగదారులు వినియోగించుకొన్నందుకు మాచర్ల ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ యన్. సింగయ్య ధన్యవాదములు తెలిపారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







