విశ్వకర్మ కార్పెంటర్ యూనియన్ అధ్యక్షునిగా బైరోజు వెంకన్న, ప్రధాన కార్యదర్శిగా దేవులపల్లి రమేష్ చారి ఎన్నిక
నారద వర్తమాన సమాచారం
నల్గొండ జిల్లా ఇంచార్జ్: బంధనకంటి శంకరాచారీ
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో శనివారం విశ్వకర్మ కార్పెంటర్ యూనియన్ అధ్యక్ష ఎన్నికలు జరగగా మొత్తం 663 ఓట్లు పోలయ్యాయి. అధ్యక్షుడిగా బై రోజు వెంకటాచారికి 354 ఓట్లు, ప్రధాన కార్యదర్శిగా దేవులపల్లి రమేష్ చారి కి 364 ఓట్లు పోలయ్యాయి. తన సమీప ప్రత్యర్థి పై బైరోజు వెంకన్న 74 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. దేవులపల్లి రమేష్ చారి 55 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ సందర్భంగా అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ సంఘానికి ఎల్లవేళలా కృషి చేస్తామన్నారు. ప్రతి ఒక్క సభ్యునికి అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కరిస్తామని సంఘ అభివృద్ధికి తోడ్పడతామని తెలిపారు. తమకు ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు, నాయకులు,యువకులు పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







