గోగువారిగూడెం లో ఘనంగా 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
నారద వర్త మన సమాచారం
నల్గొండ జిల్లా ఇన్చార్జ్: శంకర్
77 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్ కొండ అరుణ-సోమయ్య జాతీయ జెండాని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అరుణ మాట్లాడుతూ మనకు 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చినప్పటికీ 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చిందని, అప్పటి నుండి భారతు సర్వసత్తాక, ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యాంగ ఆవిర్భవించిందని అన్నారు. అలాగే ప్రాథమిక పాఠశాలలో కూడా ప్రధానోపాధ్యాయులు కోటియ జెండా నావిష్కరించారు. అలాగే నంది అవార్డు గ్రహీత ద్రోణాచారిని ఘనంగా సన్మానించారు. అనంతరం గ్రామసభ నిర్వహించారు గ్రామసభలో గ్రామానికి సంబంధించిన తీర్మానాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బండ్ల పద్మమ్మ, పంచాయతీ కార్యదర్శి జగదీష్, వార్డు మెంబర్లు, గౌని మమత,బండ్ల శ్రావణి, ముద్దం సుజాత,పాఠశాల ఉపాధ్యాయులు జనార్దన్ చారి, అంగన్వాడీ టీచర్స్ ఝాన్సీ రాణి, మల్లేశ్వరి, గ్రామ పెద్దలు అయినంపూడి సాంబశివరావు, సంక్రాంతి లక్ష్మారావు, శ్రీనివాసరావు, మైలపల్లి వెంకటేశ్వర్లు, బందనకంటి ద్రోణాచారి ఊట్ల సైదా రావు, బండ్ల పాపయ్య, మాజీ సర్పంచ్ కొండా వెంకటయ్య, మేకల రఘు, నామ అశోక్ కొండా సతీష్,బండ్ల నరేష్, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







