నారద వర్తమాన సమాచారం
వరికపూడిశెలలో మే 1 నుంచి దీక్ష చేపడతాం గురజాల అప్పారావు
వరికపూడి ప్రాజెక్టు నిర్మాణానికై మే 1 నుండి 42 రోజుల పాటు దీక్ష చేపట్టనున్నట్టు జల సాధన సమితి ప్రధాన కార్యదర్శి పల్నాడు శ్రీను స్పష్టం చేశారు. స్థానిక సిపిఐ కొమెర వీరాస్వామి భవన్ లో ప్రాజెక్టు సాధన సమితి అధ్యక్షులు బత్తుల వీరయ్య యాదవ్ అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఆయన హాజరయ్యారు. పల్నాడు శ్రీను మాట్లాడుతూ పల్నాటి ప్రాంత వాసులకు వరికపూడిశెల దశాబ్దాల నుండి కలగా మిగిలిందన్నారు. పాలకులు ఎందరు మారినా ప్రాజెక్టు నిర్మాణం మాత్రం అడుగు ముందుకు వేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు నిర్మాణ పనులు త్వరలో ప్రారంభిస్తామంటూ ఇంతకాలం పాలకులు కాలం గడపటం దుర్మార్గమన్నారు.
అనుమతులు సాధించాం… త్వరలో పనులు ప్రారంభిస్తామంటూ మాటలు చెబుతూ ఇప్పుడు ఇంకా పూర్తి అనుమతులే రాలేదంటూ పాలకులు మాట్లాడటం లో అర్థం లేదన్నారు. అనుమతులే రాకుండా ఎలా పనులు ప్రారంభిస్తామని పల్నాడు ప్రజలను ఎందుకు మబ్బి పెడుతున్నారో సమాధానం చెప్పాలన్నారు. పాలకుల రెండు నాలుకల ధోరణి ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టే వరకు ఉద్యమిస్తామని, కార్యక్రమంలో భాగంగానే మే 1 నుండి జూన్ 12 వరకు 42 రోజులపాటు వరకు వరికపూడిసెల సాధన సమితి కమిటీ తోపాటు మద్దతు పలికిన రైతులతో గ్రీన్ కలర్ బట్టల ధరించి దీక్ష చేపట్టనున్నట్టు ఆయన పేర్కొన్నారు. అప్పటికి స్పందించకపోతే రిలే నిరాహార దీక్ష కైనా వెనుకాడేది లేదని ఆయన హెచ్చరించారు. సమావేశంలో సిపిఐ మాచర్ల ఏరియా టౌన్ సెక్రటరీ మిద్దెపోగు బాబురావు, ఎంసిపిఐ రాష్ట్ర నాయకులు అబ్రహం లింకన్, ఎంసిపిఐ యు జిల్లా నాయకులు మాచవరపు నాగేశ్వరరావు, శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి జాతీయ ప్రజా హక్కుల పరిరక్షణ సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు గురజాల అప్పారావు, రిటైర్డ్ ఎంఈఓ గాదె రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








