Tuesday, July 21, 2026
spot_img

తల్లికి వందనం పథకం పేరుతో వచ్చే నకిలీ లింకుల పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి.

నారద వర్తమాన సమాచారం

తల్లికి వందనం పథకం పేరుతో వచ్చే నకిలీ లింకుల పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి.

తెలియని వ్యక్తులు పంపిన లింకులను క్లిక్ చేయవద్దు నమ్మ వద్దు.

సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోవద్దు.

వ్యక్తిగత వివరాలు, ఓటీపీలు ఎవరికీ పంచుకోవద్దు

వ్యక్తిగత వివరాలు, ఓటీపీలు ఎవరికీ పంచుకోవద్దు

కర్నూలు ఎస్పీ  విక్రాంత్ పాటిల్ ఐపీఎస్

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న “తల్లికి వందనం” పథకం పేరుతో సైబర్ నేరగాళ్లు విద్యార్థుల తల్లిదండ్రులను లక్ష్యంగా చేసుకుని నకిలీ లింకులు పంపి మోసాలకు పాల్పడే అవకాశం ఉందని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్  ఆదివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. పథకానికి సంబంధించిన దరఖాస్తులు, అర్హత వివరాలు, నగదు జమ తదితర అంశాల పేరుతో వాట్సాప్, ఎస్ఎంఎస్ లేదా సోషల్ మీడియా ద్వారా వచ్చే అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని సూచించారు. అటువంటి లింకుల ద్వారా బ్యాంకు ఖాతా వివరాలు, ఆధార్ నంబర్, ఓటీపీలు, పాస్‌వర్డ్లు వంటి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి సైబర్ మోసాలకు పాల్పడే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారం కోసం అధికారిక ప్రభుత్వ వేదికలు, స్వర్ణ గ్రామ/స్వర్ణ వార్డు కార్యాలయాలను లేదా సంబంధిత అధికారులను మాత్రమే సంప్రదించాలని సూచించారు. కేవలం ప్రభుత్వ అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలన్నారు. తెలియని వ్యక్తులు పంపిన లింకులను నమ్మవద్దని, వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతా సమాచారం, ఏటీఎం వివరాలు, ఓటీపీలు, పాస్‌వర్డ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోవద్దని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. సైబర్ మోసాలకు గురైన వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలని లేదా www.cybercrime.gov.in పోర్టల్ లో లేదా సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ సూచించారు…


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading