నారద వర్తమాన సమాచారం :ప్రతినిధి
నగర పాలక సంస్థ, గుంటూరు
ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రాజకీయ పార్టీలు తమ అభ్యర్ధుల ప్రచారం కోసం ప్రచురించే కరపత్రాలు, పోస్టర్స్ పై తప్పనిసరిగా ప్రింటర్, పబ్లిషర్ ల వివరాలు చిరునామాతో సహా ప్రింట్ చేయాలని నగర కమిషనర్, గుంటూరు తూర్పు నియోజకవర్గ (95) రిటర్నింగ్ అధికారి (ఆర్ఓ) కీర్తి చేకూరి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా కమీషనర్ & రిటర్నింగ్ అధికారి మాట్లాడుతూ, 2024 సాదారణ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు తమ అభ్యర్ధుల ప్రచార కరపత్రాలు, పోస్టర్స్ ల్లో కేంద్ర ఎన్నికల సంఘం ఆర్ పి చట్టం, 1951లోని సెక్షన్ 127 ఏ ప్రకారం మరియు ఎన్నికల ప్రవర్తనా నియమావళి మేరకు తప్పనిసరిగా ప్రింటర్, పబ్లిషర్స్ చిరునామా, పేరు స్పష్టంగా ప్రింట్ చేయించాలన్నారు. కరపత్రాలు, పోస్టర్స్ లో వివరాలు ప్రింట్ చేయడం ద్వారా వాటిలోని అంశాలు ఎన్నికల ప్రవర్తనా నియమావళి మేరకు లేకున్నా లేదా ప్రచారానికి, ప్రింటింగ్ ఖర్చులకు భాధ్యులను గుర్తించడం తేలికవుతుందని పేర్కొన్నారు. కనుక గుంటూరు తూర్పు నియోజకవర్గంలో రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ప్రింటర్, పబ్లిషర్స్ వివరాలు కూడా పోస్టర్స్, కరపత్రాల పై ముద్రించి సహకరించాలని కోరారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.