నారద వర్తమాన సమాచారం
బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం: తెలుగు రాష్ట్రాలకు తుఫాను ముప్పు!
తూర్పు-మధ్య బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు, అనుకూల వాతావరణ పరిస్థితుల వల్ల ఇది తీవ్రమై పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ ఈ నెల 24 నాటికి వాయుగుండంగా, అనంతరం ఈ నెల 26 నాటికి తీవ్ర తుఫానుగా బలపడే అవకాశముందని అధికారులు అంచనా వేశారు.
ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని స్పష్టం చేశారు. తుఫాను తీరం వైపు సమీపిస్తున్న క్రమంలో ఈ నెల 27 నుంచి తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు ప్రారంభమవుతాయి.
ముఖ్యంగా ఈ నెల 28, 29 తేదీల్లో ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 60 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని వెల్లడించారు. సముద్రం అల్లకల్లోలంగా మారనున్నందున మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లవద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








