నారద వర్తమాన సమాచారం :ప్రతినిధి
పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసాం,ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి- పల్నాడు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఐ పి యస్
చిలకలూరిపేట సార్వత్రిక ఎన్నికలు -2024 దృష్ట్యా ప్రజలు ఓటు హక్కును ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా వినియోగించుకునే విధంగా పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని రకాల ఏర్పాట్లు చేశామన్న ఎస్పీ జిల్లాలోని పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక, సాధారణ అనే విధంగా విభజించామని దానికి తగ్గట్టు బందోబస్తు ఏర్పాటు చేశామన్న ఎస్పీ ఇందులో భాగంగా నాదెండ్ల మండలం లోని అమీన్ సాహెబ్ పాలెం,కనపర్రు,సతులూరు, చందవరం,చిరుమామిల్ల, నాదెండ్ల గ్రామాలలో లో గల పోలింగ్ కేంద్రాలను ఎస్పీ సందర్శించి అక్కడ భద్రతా ఏర్పాట్లు గురించి పోలీసు అధికారులకు సూచించారు. అదేవిధంగా అక్కడ ప్రజలతో మాట్లాడారు,
ప్రజలకు ఎన్నికల నియమావళి ని గురించి వివరించి ప్రజలు ఎన్నికల నియమావళిని ఉల్లంగిచరాదని, ఎన్నికల నియమావళి ఉల్లంఘన జరిగినట్లయితే పోలీసు వారికి ఫిర్యాదు చేయాలని కూడా సూచించారు.ప్రజలు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి అని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎస్పీ తో పాటు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ రాఘవేంద్ర గ, చిలకలూరిపేట రూరల్ సిఐ శ్రీనివాస రెడ్డి , చిలకలూరిపేట టౌన్ సిఐ రమేష్ ,నాదెండ్ల ఎస్ఐ బలరామ్ రెడ్డి, మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు..
Discover more from
Subscribe to get the latest posts sent to your email.