నారద వర్తమాన సమాచారం :ప్రతినిధి
పేదల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు
గత పరిపాలనను భేరీజు వేసుకొని ఓటు వేయండి.
ఈనెల 25వ తేదీన నామినేషన్ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి
ఫణిదం గ్రామంలో పర్యటించిన మంత్రి అంబటి
సత్తెనపల్లి
సత్తెనపల్లి నియోజకవర్గ వైయస్సార్సీపి శాసనసభ అభ్యర్థిగా ఈనెల 25వ తేదీన నామినేషన్ వేనున్నానని ఈ కార్యక్రమానికి భారీ స్థాయిలో హాజరై జయప్రదం చేయాలని రాష్ట్ర జలవనరుల శాఖామంత్రి అంబటి రాంబాబు నాయకులను కలిసి వివరిస్తున్నారు. శుక్రవారం రూరల్ మండల పరిధిలోని ఫణిదం గ్రామంలో ఆయన పర్యటించారు. కీలక నాయకుల నివాసాలకు వెళ్లి వారితో భేటీ అయ్యారు. మాజీ ఏఎంసీ చైర్మన్ పంచుమర్తి అప్పారావు, సర్పంచ్ వేమవారపు బుల్లిబాబు, ఎంపీటీసీ సభ్యులు భూపతి, ఫణిదం సొసైటీ చైర్మన్ బొడ్డు నాగేశ్వరరావు , పార్టీ క్రియాశీలక నాయకులు కూచిపూడి సైమన్ , ముస్లిం నాయకుడు నబీ ల నివాసాలకు కలిశారు. అనంతరం ఎస్టీ కాలనీ ని సందర్శించి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి స్థానికులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా నియోజకవర్గంలో ధర్మపద్ధమైన పరిపాలనను అందించానన్నారు. రాజకీయాలకతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు. వేధింపులు , వ్యక్షగత సాధింపులు లేకుండా అన్ని వర్గాలకు ప్రశాంతమైన వాతావరణాన్ని అందించానన్నారు. గత పరిపాలనతో భీరీజు వేసుకొని ఫ్యాను గుర్తుపై ఓటు వేసి ఇక్కడ నన్ను , నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ గెలిపించాలని అంబటి అభ్యర్థించారు. రానున్న ఎన్నికలు ఎంతో కీలకమైనవని, పేద వర్గాల భవిష్యత్తులను నిర్ణయించేవన్నారు. గ్రామాల్లోని క్రియాశీలక నాయకులు ఓటర్లను చైతన్యం చేసి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అందించిన సంక్షేమ పథకాలను వివరించాలని సూచించారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ రాయపాటి పురుషోత్తమరావు ,రాష్ట్ర రైతు సలహా మండలి సభ్యులు కళ్ళం విజయభాస్కర్ రెడ్డి స్థానిక నాయకులు తదితరులు ఉన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.