అకాల వర్షాలు …వడగళ్ళు … పంటనష్టం
పంట నష్టపోయిన ప్రతి రైతును అన్ని విధాల ఆదుకుంటాం
రైతులు, కౌలు రైతులతో మాట్లాడి ధైర్యం చెప్పిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
నారద వర్తమాన సమాచారం కామారెడ్డి జిల్లా ప్రతినిధి : ఏప్రిల్ 20,
కామారెడ్డి నియోజకవర్గం మాచారెడ్డి మండలం సోమార్ పేట్ గ్రామంలో అకాల వర్షాల వల్ల కళ్ళల్లో ఆరబెట్టిన వరి ధాన్యం కొట్టుకపోవడం మరియు దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మాచారెడ్డి మండలంలోని సోమర్ పేట్ గ్రామలో పర్యటన ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ
సోమార్ పేట్ గ్రామంలో గ్రామంలో గాలికి ఇంటి పై కప్పు ఎగిరి పోవడంతో వారిని ఆదుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది.గ్రామాల్లో పంటల స్థితిగతులను క్షేత్రస్థాయిలో పరిశీలన
రైతులు, కౌలు రైతులతో మాట్లాడి ధైర్యం చెప్పిన షబ్బీర్ అలీ రైతులు నిరాశ నిస్పృహలకు లోను కావద్దు.పంట నష్టపోయిన ప్రతీ రైతును అన్నివిధాలా ఆదుకుంటాం,నష్టం జరిగిన రైతులందరికీ పరిహారం చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది గత 15 రోజుల క్రితం రైతు సోదరుల ఆత్మస్థైర్యం దెబ్బతినొద్దని ఆలోచించి సీఎం రేవంత్ రెడ్డి పంట నష్టంపై సర్వే చేయించి వారి వివరాలు సేకరించి వారికి నష్టపరిహారం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు.ఎన్నికల తర్వాత వారందరికీ నష్టపరిహారం అందిస్తాం. కల్లాల్లో వరి ధాన్యం ఆరబెట్టిన రైతులధాన్యం వర్షానికి కొట్టుకు పోయింది.అక్కడినుండి కలెక్టర్ తో మాట్లాడారు తడిసిన ధాన్యాన్ని కూడా కొనాలని అధికారులతోమాట్లాడారు.
వర్షానికి కొట్టుకపోయిన ధాన్యానికి అంచనా వేసి దానికి కూడా ప్రత్యేక నిధుల ద్వారా నష్టపరిహారం అందిస్తామని హామీ ఇవ్వడం జరిగింది
Discover more from
Subscribe to get the latest posts sent to your email.