నారద వర్తమాన సమాచారం
వ్యాపారస్తుడ్ని కాను..రాజకీయాన్ని సైతం వ్యాపారంగా మార్చను…!
– వైఎస్సార్‌సీపీ చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్‌నాయుడు
– 17వ వార్డులో ఎన్నికల ప్రచారం
– ఇంటింటా ప్రచారం..అపూర్వ స్వాగతం
నియోజకవర్గ ప్రతిపక్షనేతలా వ్యాపారస్తుడిని కాను..రాజకీయాన్ని వ్యాపారంగా మార్చే ప్రశక్తే లేదని, కేవలం ప్రజాసేవ కోసమే అసెంబ్లీ అభ్యర్థిగా పోటీబరిలో నిలిచానని వైఎస్సార్‌సీపీ చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు స్పష్టం చేశారు. గురువారం పట్టణంలోని 17వ వార్డులో పార్టీ శ్రేణులతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వార్డు పర్యటనకు వచ్చిన కావటిని పార్టీ నాయకులు ఘనస్వాగతం పలికారు. గంటాలమ్మ చెట్టు, చీరాల రోడ్డు, వెంకటరెడ్డినగర్, గవర్నమెంట్ ఆసుపత్రి తదితర ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారాన్ని చేపట్టారు. అవ్వాతాతలను ఆప్యాయంగా పరామర్శిస్తూ..వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేసిన నవరత్న సంక్షేమ పథకాలు వచ్చాయా అంటూ ఆరాతీస్తూ..స్థానిక సమస్యల్ని తెలుసుకుంటూ కొనసాగించారు. అనంతరం కావటి మనోహర్ నాయుడు మాట్లాడుతూ తాను ప్రతిపక్ష నేత ప్రత్తిపాటి పుల్లారావులా వ్యాపరస్తుడిని కానని, రాజకీయాన్ని వ్యాపారంగా మార్చే మనస్తత్వం కాదంటూ ఘాటుగా విమర్శించారు. చికలూరిపేట నియోజకవర్గంతో తనకు బంధుత్వం విడదీయరాని బంధం ఉందన్నారు. కాబట్టే ఇక్కడి ప్రజలకు సేవ చేయాలన్న ఏకైక లక్ష్యంతోనే అసెంబ్లీ బరిలో దిగినట్టు తెలిపారు. తాను టీడీపీ కూటమి బూటకపు వాగ్ధానాలు చేయనని, చేయలనుకున్నదే చెపుతానన్నారు. మాట ఇవ్వకముందుగానే ఆలోచించాలని..ఇచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలన్న తనతల్లి చెప్పిన మాటకు కట్టుబడి నడుస్తున్నట్లు పేర్కొన్నారు. సీఎం జగనన్న ఆశ ఆశీస్సులతో ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ముందుకు వచ్చానని తెలిపారు. నియోజవర్గ ప్రజలు తనను ఆశీర్వదించి ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే సేవకుడిలా పని చేస్తానని చెప్పారు. చిలకలూరిపేట నియోజకవర్గాన్ని ప్రగతి పథాన నిలుపుతానని స్పష్టం చేశారు. సామాజిక న్యాయం వైఎస్సార్‌సీపీతోనే సాధ్యమవుతుందని చెప్పారు. సంక్షేమ పథకాలు యధావిధిగా కొనసాగాలంటే మరోసారి వైఎఎస్సార్‌సీపీని గెలిపించాలని కోరారు. మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తమ అమూల్యమైన రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా పి అనిల్‌కుమార్ యాదవ్, చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో 17వ వార్డు కౌన్సిలర్ పుల్లగూర అనురాధ, పట్టణ వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు పఠాన్ తలహాఖాన్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బొల్లెద్దు చిన్న, పార్టీ నాయకులు పుల్లగూర భరత్, ఊసా రమేష్, పొనుగుబాటి మోష, నిరంజన్, మాదాసు రవీంద్ర, శ్రీను, సాఫా సైదా, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.