పి డి ఎస్ యు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి
నామాల ఆజాద్..
ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడిని అరికట్టాలి..
పి డి ఎస్ యు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి
నామాల ఆజాద్..
నారద వర్తమాన సమాచారం కామారెడ్డి జిల్లా ప్రతినిధి:ఏప్రిల్ 28,
తెలంగాణ రాష్ట్రంలో 2024-2025 విద్య సంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్ ల ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకముందే ముందస్తు అడ్మిషన్ల పేరిట విద్యార్థుల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడిని అరికట్టి, ఆ విద్యాసంస్థల గుర్తింపులు రద్దు చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి.డి.ఎస్.యు) తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నామాల ఆజాద్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఆదివారం కామారెడ్డి పి.డి.ఎస్.యు. జిల్లా కమిటీ కార్యవర్గ సమావేశం జిల్లా కేంద్రంలోని స్థానిక కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు సురేష్ అధ్యక్షతన జరిగింది.ఈ యొక్క సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆజాద్ హాజరైనారు ఈ సందర్భంగా పి.డి.ఎస్. యు. రాష్ట్ర , ప్రధాన కార్యదర్శి నామాల ఆజాద్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్, కార్పొరేటర్ విద్యాసంస్థలు ఎలాంటి పర్మిషన్స్ లేకుండా, అదనపు బ్రాంచీలను ఏర్పాటు చేసుకొని విద్యార్థుల వద్ద నుండి విచ్ఛలవిడిగా లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నా అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత విద్యాశాఖ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు సంబంధిత విద్యాశాఖ అధికారుల అండదండలతో విద్యా వ్యాపారానికి పాల్పడుతున్నారని తీవ్రంగా ఆక్షేపించారు.రాష్ట్ర ప్రభుత్వం అడ్మిషన్ల ప్రక్రియకు పర్మిషన్ ఇవ్వకముందే ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు రాష్ట్రంలోని వివిధ నగరాల్లోని ప్రధాన కూడళ్లలో భారీ హోల్డీంగ్ లు నెలకొల్పుకోని ఫ్లెక్సీలతో ప్రచారం నిర్వహిస్తూ, ముందస్తు అడ్మిషన్లకు పాల్పడుతూ విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు మాయ మాటలు చెబుతూ లక్షలాది రూపాయలు ఫీజుల రూపంలో దోచుకుంటున్నారని తెలిపారు.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత విద్యాశాఖ అధికారులు స్పందించి ముందస్తు అడ్మిషన్లకు పాల్పడుతున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలను గుర్తించి చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న ప్రైవేట్ విద్యాసంస్థల గుర్తింపు రద్దు చేయాలని, ప్రైవేట్ విద్యాసంస్థలు ఫీజులు నియంత్రిస్తూ సమగ్ర చట్టం తేవాలని, గత మూడు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ ,స్కాలర్షిప్ తక్షణమే విడుదల చేయాలని, ప్రభుత్వ విద్యా సంస్థల బలోపేతానికి, అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలని డిమాండ్ చేశారు.లేకపోతే పి.డి.ఎస్.యు.ఆధ్యర్యం లో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ సమావేశంలో పి.డి.ఎస్.యు. అధ్యక్షులు జీ.సురేష్, ఉపాధ్యక్షులు సరీచంద్, జిల్లా నాయకులు నవీన్, సుశీల్, మహేష్, రామ్దాస్, బాలాజీ, సచిన్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.