తెలంగాణ జన సమితి పార్టీ ఆధ్వర్యంలో “ప్రమాదంలో ప్రజాస్వామ్యం – బహిరంగ చర్చ”
ముఖ్య అతిథులుగా టీ.జే.ఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం
గతంలో ఎన్నడు లేని విధంగా దేశంలో నిరుద్యోగం పెరిగింది
పెట్రోల్ డీజిల్ ధరలు అధికంగా పెంచడంతో సామాన్ల మీద భారం పెరిగింది
నారద వర్తమాన సమాచారం కామారెడ్డి జిల్లా ప్రతినిధి మే01,
కామారెడ్డి జిల్లా కేంద్రంలో తెలంగాణ జన సమితి పార్టీ ఆధ్వర్యంలో ” ప్రమాదంలో ప్రజాస్వామ్యం – బహిరంగ చర్చ “టి.జె.ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిజ్జన రమేష్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టి.జె.ఎస్ అధ్యక్షులు ప్రొ.కోదండరాం , టి పి జె ఏ సి మరియు రైతు స్వరాజ్య వేదిక నాయకులు కన్నెగంటి రవి హాజరయ్యారు..
ఈ సందర్బంగా ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతు రాజ్యాంగం అందరికీ సమాన అవకాశాలు కల్పించింది భావప్రకటనా స్వేచ్ఛను కలిపించింది. భారత దేశ ప్రజా స్వామ్య వ్యవస్థ ప్రపంచంలోనే గొప్పదని ప్రపంచం దేశాలు మాట్లాడుతాయి కానీ ఇప్పుడు మాత్రం కేంద్రంలో బిజెపి భావప్రకటనా స్వేచ్ఛ లేకుండా నిరంతరం దాడి చేస్తుంది…
ఎదురించిన వారి మీద కేసులు పెట్టి దాడులు చేస్తున్నారు..
కాకతీయ యూనివర్సిటీలో కవులు రచయితల మీద దాడి భావప్రకటనా స్వేచ్ఛ మీద దాడే అన్నారు.పెట్రోల్,డీజిల్ ధరలు అధికంగా పెంచడంతో సామాన్యుల మీద భారం పెరిగింది..వ్యవసాయ రంగంలో కూడా ధరలు అధికంగా పెరిగాయి..గతంలో ఎన్నడూలేని విధంగా దేశంలో నిరుద్యోగం పెరిగింది.దేశ సంపదలో 162 మంది బిలియనీర్లు 25% ఉత్పత్తిని 48% సంపదను అనుభవిస్తున్నారు. అట్టడుగున ఉన్న 50% మంది ప్రజలు 15% ఉత్పత్తిని, 6.4% సంపదను పొందుతున్నారు.
ఈ ఎన్నికల్లో బిజెపి గెలిస్తే రాజ్యాంగానికి, దేశానికి ప్రమాదం.మతం పేరుతో భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారు..ఈ సందర్భంలో మనమందరం ఐక్యంగా ఉండి వారిని తిప్పికొట్టాలి.ఎలక్ట్రాల్ బాండ్ తెచ్చి అవినీతిని చట్టబద్ధం చేసారు.బిజెపికి ఎలెక్టోరల్ బాండ్స్ ఇచ్చిన వారిని కేసుల నుండి తప్పించారు.ప్రశ్నించే గొంతులను ప్రతిపక్షాలను అణిచివేశారు.మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసిఆర్ నిరంకుశ ప్రభుత్వాన్ని ఓడగట్టినట్టే, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మోడీని, బిజెపిని ఓడగొట్టాలి.జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో సురేష్ షెట్కార్ ని గెలిపించాలని కోరారు..
రైతుకు నల్ల చట్టాలు తెచ్చి మోసం చేశారు.ఈ సమావేశంకు ఎంపీ అభ్యర్థి కూతురు గిరిజ శెట్కార్ మాట్లాడుతు ఇప్పుడు మనం ఎన్నికల సమయంలో ఉన్నాం అందరు ఈ ఎన్నికలలో సహకారం కావాలి ఎంపీ అభ్యర్థి గా పోటీ చేస్తున్న జాహిరాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ శెట్కార్ తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు జాహిరాబాద్ పార్లమెంట్ లో అన్ని సమస్యలపై ద్రుష్టి పెట్టి అభివృద్ధి కోసం పాటు పాడుతారు అని అన్నారు గెలిపించాలని కోరారు.
టి పి జే ఏ సి జిల్లా కన్వీనర్ జగన్నాథo కి నోట్ ప్రవేశ పెట్టారు టీజెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కుంబాల లక్ష్మణ్ యాదవ్ స్వాగోతోపన్యాసం చేసారు.ఈ కార్యక్రమం లో మోడీ వర్సెస్ ప్రజలు అనే నినాదంగా తీసుకోవాలని తీర్మానం చేసారు.తీర్మానం గత 10 సంవత్సరాలుగా బిజెపి నిరoకుశ పాలనను ఓడించి ప్రజాస్వామ్యం పరిరక్షణ కొరకు కాంగ్రెస్ ను గెలిపించటానికి సమిష్టిగా ఈ ఎన్నికలలో ప్రచారం నిర్వహించాలి. టి పి జె ఎ సి రాష్ట్ర కో- కన్వీనర్ వేణుగోపాల్ సి.పి.ఐ నాయకులు నర్సింహా రెడ్డి,బహుజన ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు క్యాతం సిద్దిరాములు, టి పి టి ఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు రమణ,కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కైలాష్ శ్రీనివాస్,యువత జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఇలియాజ్ అలీ రైతు సమితి రాష్ట్ర అధ్యక్షులు శ్రీహరి రావ్, మోహన్ రెడ్డి, చందు, డాక్టర్ మల్లికార్జున్ సిపిఎం జిల్లా కార్యదర్శి వెంకట్ గౌడ్, సి.పి.ఐ జిల్లా నాయకులు దశరత్, రైతు సంగం జిల్లా నాయకులు మోతిరం నాయక్, ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ మదన్ లాల్, మాజీ జడ్పీటీసీ నాయకులు మల్లయ్య, బీమ్ ఆర్మీ జిల్లా నాయకులు రావణ్ భారత్ జోడో అభియాన్ జిల్లా నాయకులు నబి ప్రజాపంతా నాయకులు ప్రకాష్, విద్యార్థి సంఘాల నాయకులు, బి వి ఎం విట్టల్, ఎస్ ఎఫ్ ఐఅరుణ్, ఎన్ ఎస్ యు ఐసందీప్, బీసీ విద్యార్థి సంగం రాష్ట్ర అధ్యక్షులు పర్శరామ్ యాదవ్,బీసీ సంగం జిల్లా యూతవ అధ్యక్షులు రాజీవ్, పి డి ఎస్ యు సురేష్, హాజరు అయి ప్రసంగించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.