నారద వర్తమాన సమాచారం
బెల్లంకొండ మండలం నుంచి వైఎస్సార్సీపీలోకి భారీ చేరికలు
ఎమ్మెల్యే నంబూరు శంకరరావు సమక్షంలో వైసీపీలో చేరిన 200 కుటుంబాలు
ఎన్నికల వేళ వైఎస్సార్సీపీలో భారీ చేరికలు కొనసాగుతున్నాయి. బెల్లంకొండ మండలంలోని పలు గ్రామాల నుంచి సుమారు 200 కుటుంబాలు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు సమక్షంలో వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. బెల్లంకొండలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నంబూరు శంకరరావు వారికి స్వయంగా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నందిరాజుపాలెం, పాపాయపాలెం, ఎమ్మాజీగూడెం, వన్నాయపాలెం, చండ్రాజుపాలెం, గంగిరెడ్డి పాలెం గ్రామాలకు చెందిన బీసీ సామాజిక వర్గాల వారు వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మాట్లాడుతూ.. సీఎం జగన్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అందిస్తున్న సంక్షేమం చూసి ఎంతోమంది తమ పార్టీలో చేరుతున్నారన్నారు. వచ్చె ఎన్నికల్లో నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ గెలుపు ఖాయమన్నారు. గత ఐదేళ్లలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని.. మరోసారి తనను గెలిపిస్తే.. మరింత అభివృద్ధి చేస్తానన్నారు. వైఎస్సార్సీపీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.