నారద వర్తమాన సమాచారం
అమరావతి
కేసీఆర్‌లాగానే జగన్‌ను భూ రక్ష పథకమే ఓడిస్తుంది – సర్కార్‌కు నారాయణ శాపం
భూవివాదాల పరిష్కారమంటూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పథకంలోని సర్వే తప్పుల తడకగా మారింది. అస్తవ్యస్థ భూ లెక్కలతో అన్నదాతలకు సమస్యలకు పరిష్కారం చూపకపోగా కొత్త భూ సమస్యలు తెచ్చి పెడుతోందని రైతులు తలలు పట్టుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో రైతులు లేకుండానే అధికారులు రీసర్వే చేయడంతో భూ లెక్కల్లో గందరగోళం నెలకొన్న విషయం అందరికీ తెలిసిందే. దీంతో జగనన్న భూరక్ష పథకం కాస్తా భూ భక్ష పథకంగా మారిందనే విమర్శలు వచ్చాయి.
తాజాగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఈ పథకంపై స్పందిస్తూ, తెలంగాణలో కేసీఆర్ ధరణితో ఓడిపోయారనీ, అలాగే సీఎం జగన్ కూడా వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పథకంతోనే భూస్థాపితం అవుతారని తనదైన శైలిలో శాపనార్థాలు పెట్టారు. చిత్తూరు జిల్లా నగరి మండలంలోని ఆయన స్వగ్రామం ఆయనంబాకంలో భూములను పరిశీలించి ఈ వ్యాఖ్యలు చేశారు.
ఉత్త డొల్లనే లోపల ఏమీ లేదు: ఈ పథకంలో భాగంగా జగన్ ఫొటోతో కూడిన పాస్ పుస్తకాలు ఇస్తున్నారని నారాయణ అన్నారు. ఈ పుస్తకంలో డొల్ల తనమే తప్ప, కనీసం నా
Discover more from
Subscribe to get the latest posts sent to your email.