నారద వర్తమాన సమాచారం
చాంద్రాయణగుట్ట: హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఓటర్లు మొదటి నుంచి స్థానికేతరులకే పట్టంకడుతున్నారు. ఆ నియోజకవర్గానికి చెందిన వారు విజయం సాధించలేకపోయారు. స్వరాష్ట్రానికి చెందిన వారినే కాదు ఇతర రాష్ట్రాల వారిని సైతం ఆదరించారు. ఈ సారి ఎవరివైపు మొగ్గు చూపుతారో చూడాలి.
తొలినుంచి విజేతలు..
1951లో లోక్‌సభకు మొదటిసారి జరిగిన ఎన్నికల్లో సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన అహ్మద్ మొహియుద్దీన్ భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ః 1957లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి విజయం సాధించిన వినాయక్‌రావు కోరాట్కర్ మహారాష్ట్ర ఉస్మానాబాద్ జిల్లా కాలంబ్ ప్రాంతానికి చెందినవారు.
1962, 1967 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున, 1971లో తెలంగాణ ప్రజాసమితి తరఫున పోటీ చేసి విజయం సాధించిన గోపాల సుబ్బు కృష్ణ మెల్కోటే(జి.ఎస్.మెల్కొటే) ఒడిశాలోని బరంపూర్‌కు చెందిన వారు. ః 1977, 1980 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి విజయం సాధించిన కె.ఎస్.నారాయణ సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన వారు.
మజ్లిస్ నుంచి వరుసగా ఆరుసార్లు విజయం సాధించిన సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ హిమాయత్‌నగర్ ప్రాంతవాసి. నాలుగుసార్లు గెలిచిన అసదుద్దీన్‌ఒవైసీ గతంలో హిమాయత్‌నగర్‌లో, ప్రస్తుతం రాజేంద్రనగర్‌లో ఉంటున్నారు. ః తాజా ఎంపీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న భాజపా అభ్యర్థి కె.మాధవీలతది కంటోన్మెంట్ కాగా.. కాంగ్రెస్ అభ్యర్థి వలీ ఉల్లా సమీర్‌ది జూబ్లీహిల్స్. గోషామహల్‌కు చెందిన భారాస అభ్యర్థి గడ్డం శ్రీనివాస్‌యాదవ్ ఒక్కరే స్థానికుడు కావడం విశేషం.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.