నారద వర్తమాన సమాచారం
దర్శి.
విద్యార్థుల అభినందన సభలో మాట్లాడుతున్న రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు
విద్యా వైద్యం ను ప్రోత్సహిద్దాం సంఘానికి అండగా ఉందాం.. బీసీ కమిషన్ సభ్యులు కుందుర్తి . విశ్వబ్రాహ్మణ సంఘీయుల పిల్లల విద్య అభివృద్ధికి ఆరోగ్య అభివృద్ధిని ప్రోత్సహిద్దాం సంఘానికి అండగా ఉంటే సంఘమే మనకు అండగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ బీసీ కమిషన్ మెంబర్ కుందుర్తి గురవాచారి అన్నారు. ఆదివారం దర్శి లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో జరిగిన పదవ తరగతి ఇంటర్మీడియట్ లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు ప్రోత్సాహక అభినందన సభ లో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ విద్య పట్ల మక్కువతో విద్యనభ్యసించి నట్లు అయితే ఉన్నత శిఖరాలను అందిపుచ్చుకోవచ్చు అన్నారు. మన కులం చిన్న కులమైన విశ్వబ్రాహ్మణ కులంలో నాకు వైసిపి గవర్నమెంట్ 139 కులాలకు పైన వేసిన బీసీ కమిషన్ సభ్యులుగా నియమించడం నాకు ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. విద్యలో బాగా అభివృద్ధి చెంది ఏదో ఒక రంగంలో పట్టు సాధించి మొదటి స్థానంలో నిలవాలని విద్యార్థినీ విద్యార్థులకు తల్లిదండ్రులకు సూచించారు.ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ భగవంతుడు మన సమాజంలోని పిల్లలకు విజ్ఞాన సమార్జన మంచి తెలివితేటలను ఇచ్చారన్నారు. సంఘాలు ఉండబట్టే మన సమస్యలను మనమే పరిష్కరించుకోగలుగుతున్నామని చెప్పారు.ఇలాంటి ప్రోత్సాహ కార్యక్రమాలు ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్నామంటే మన సంఘాల పిల్లలు బాగా అభివృద్ధి చెందాలని సదుద్దేశంతో ఏర్పాటు చేస్తున్నామని ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొనిఅవగాహన పొందాలన్నారు. ఈ అభినందన సభ కార్యక్రమానికి జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు చెన్నుపల్లి శ్రీనివాసాచారి అధ్యక్షతన నిర్వహించారు.అనంతరం పదవ తరగతి లో 500 మార్క్స్.ఇంటర్మీడియట్ లో 800 మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులను సంఘ పెద్దలు ఘనంగా సత్కరించి
మెమోటో బహుకరించారు 54 మంది విద్యార్థులకు.1500 రు ప్రోత్సహ క. బహుమతిగా అందించారు. కార్యక్రమంలో రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం కార్యదర్శి పొన్నపల్లి బ్రహ్మానందం గాయత్రీ విశ్వకర్మ ఎడ్యుకేషన్ సొసైటీ తిరుమల స్కూల్ కరస్పాండెంట్ కె.వి రత్నాచారి డైరెక్టర్ సురేష్ బాబు అద్దంకి యశ్వంత్ సాయి తేజ ట్రస్ట్ చైర్మన్ అద్దంకి వెంకట అజయ్ బాబు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఈదుమూడి రవి. ఏలూరి వీర బ్రహ్మచారి. ప్రసాద్. ఆర్గనైజింగ్ సెక్రటరీ కుందుర్తి సీతారామ ఆంజనేయులు జిల్లా సహాయ కార్యదర్శి ఎన్ మాల్యాద్రి . విశ్వనాథ చారి. దర్శి సంఘ దొడ్డేటిపల్లి రామేశ్వరా చారి.లో పాల్గొని ప్రసంగించారు. వివిధ మండలాలనుంచి సంఘ నాయకులు విద్యార్థిని తల్లిదండ్రుల అధిక సంఖ్యలో పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.