నారద వర్తమాన సమాచారం
జగన్ గెలుపు కోసం కేసీఆర్ అండ్ కో ఆరాటం..
ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా రెండో సారి వైయస్ జగన్ అధికారం అందుకోవాలని తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ అండ్ కో భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందంటే.. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కానీ, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కానీ.. వైయస్ జగనే గెలుస్తారని తమకు అందుతున్న సమాచారమంటూ వివిధ చర్చా వేదికల్లో వారు చెప్పారు.
అయితే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిదే అధికారమంటూ ఇప్పటికే పలు సర్వేలు క్లియర్ కట్‌గా ప్రకటించాయి… ప్రకటిస్తున్నాయి. అలాంటి తరుణంలో సైతం వైయస్ జగనే మళ్లీ అధికారంలోకి వస్తారంటూ కేసీఆర్ అండ్ కో చెబుతుండడం రాజకీయ వర్గాల్లో తీవ్ర విస్మయం వ్యక్తమవుతుంది.
ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ఓటమి పాలై… ప్రతిపక్షానికే పరిమితమయ్యారు. అలాంటి సమయంలో వైయస్ జగన్ అధికారంలోకి వస్తే.. తనకు సపోర్ట్‌గా ఉంటాడని ఆయన భావిస్తున్నారనే ఓ చర్చ రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది.
అదీకాక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అండ దండ.. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిలకు ఉన్నాయనే ఓ ప్రచారం నడుస్తుంది. ఇక గతంలో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి.. ఆ పార్టీకి రాజీనామా చేసి.. కాంగ్రెస్ గూటికి చేరడం వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాత్ర కీలకమనే ఓ ప్రచారం అయితే నేటికి రాజకీయ వర్గాల్లో వైరల్ అవుతుంది. దీంతో అక్కడ వైయస్ జగన్ గెలిస్తే.. అతడి సహాయ సహకారాలు తమకు ఉంటాయని కేసీఆర్ భావిస్తున్నట్లు టాక్ నడుస్తుంది.
జగన్ అక్కడ అధికారంలో ఉంటే.. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డిని పలు విధాలుగా ఇబ్బందులు పెట్ట వచ్చనే ఆలోచనలో గులాబీ బాస్ కేసీఆర్ అండ్ కో ఉన్నట్లు ప్రచారం సైతం సాగుతుంది. అందుకే లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో.. భాగంగా కేసీఆర్ అండ్ కో చేస్తున్న వ్యాఖ్యలు చూస్తే ఇట్టే అర్థమవుతుందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
తెలంగాణలో రేవంత్ సర్కార్ రేపో మాపో కూలిపొతుందంటూ కేసీఆర్ అండ్ కో వివిధ వేదికల మీద ప్రకటనలు చేస్తుంది. ఆ క్రమంలో ఆ వైపు అడుగులు వేసేందుకు కేసీఆర్ అండ్ కోకు జగన్ అధికారంలోకి వస్తే మద్దతు లభిస్తుందనే ఆలోచన కారు పార్టీ అగ్రనేతల్లో ఉన్నట్లు తెలుస్తుంది.
ఇంకోవైపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ఓటమికి ధరణి పథకం ఓ కారణమనే వాదన ఉంది. అలాగే ఆంధ్రాలో జగన్ ప్రభుత్వాన్ని ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ చిక్కుల్లోకి నెట్టింది. అటువంటి పరిస్థితుల్లో జగన్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించేందుకు కారు పార్టీ అధినేత కేసీఆర్ ప్రణాళికలు రచిస్తున్నట్లు ఓ చర్చ సైతం పోలిటికల్ సర్కిల్‌లో హల్‌చల్ చేస్తుంది.
అందులోభాగంగానే వైయస్ జగన్ అధికారంలోకి రావాలని కేసీఆర్ అండ్ కో తెగ ఆరాటపడుతున్నట్లు కారు పార్టీ అధినేత వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుందనే ఓ ప్రచారం సైతం సాగుతుంది..
Discover more from
Subscribe to get the latest posts sent to your email.