నారద వర్తమాన సమాచారం
ఓడిపోతున్నారని ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికి కూడా అర్థమైంది: ప్రత్తిపాటి
ప్రత్తిపాటి సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు
రాష్ట్రంలో అధికార వైకాపా ఘోరపరాజయం ఎదుర్కోనుందని, ఓడిపోతున్నారనే ఆ విషయం ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికి కూడా స్పష్టంగా అర్థమైందన్నారు మాజీమంత్రి, చిలకలూరిపేట కూట మి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు. ఆ ఓటమి నైరాశ్యంలోనే సానుభూతి కోసం మళ్లీడ్రామాలు మొద లు పెట్టినట్లు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. ఇంట్లో అమ్మనాన్నల్ని చంపి, అయిన వారందర్నీ తన్ని తరిమేసి తర్వాత తాను అనాథనయ్యానని ఏడ్చే కంత్రీ రకం ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి అని దుయ్యబట్టారాయన. బుధవారం యడ్లపాడు మండలం ఉన్నవ పంచాయతీ మర్రిపాలెం ఎస్సీ కాలనీకి చెందిన 20 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం చేరాయి. మల్లెల రాజేష్ నాయుడు ఆధ్వర్యంలో దివ్వె కోటేశ్వరరావు, యడ్లపాడు జడ్పీటీసీ సభ్యుడు ముత్తా వాసు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు శ్రీను సహకారంతో వారంతా తెలుగుదేశంలో చేరారు. చిలకలూరిపేట 9వ వార్డు నెహ్రూనగర్ నుంచి వైసీపీ 7 కుటుంబాలు తెలుగుదేశంలో చేరాయి. చిలకలూరిపేటలోని తన నివాసంలో వారందరికీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు ప్రత్తిపాటి పుల్లారావు. తర్వాత మాట్లాడిన ప్రత్తిపాటి అయిదేళ్ల తర్వాత మళ్లీ దిల్లీ మీద యుద్ధం చేస్తానంటున్న ముఖ్యమంత్రి జగన్ ఇంతకాలం నిద్రపోయారా అని ప్రశ్నించారు. 2019 ఎన్నికలకు ముందు ఆయన ఎన్ని అబద్దాలు చెప్పాడో, ఎన్నివిధాలుగా బీరాలు పోయి తెలుగుదేశం మీద బురదజల్లి అధికారంలోకి వచ్చి అయిదేళ్లు ఏం చేశాడో రాష్ట్రం మొత్తం చూసిందన్నారు ప్రత్తిపాటి. అందుకే ఈ ఉత్తర కుమార పలుకులు కట్టిపెట్టాలని హితవు పలికారు. వైకాపా, జగన్‌ను ఎవరో ఎక్కడి నుంచో రావా ల్సిన పనిలేదన్న ప్రత్తిపాటి అందుకు రగిలిపోతున్న అన్నివర్గాల ప్రజలే చాలన్నారు. కావాలని పేదల పథకాలన్నింటికీ నిధులు తొక్కిపెట్టి తనకు కావాల్సిన వారికి దోచిపెట్టింది కాక ఇప్పుడు విపక్షాలపై నిందలు ఎందుకనీ నిలదీశారు. ఎన్నికల కోడ్ వస్తుందనీ తెలిసీ లబ్దిదారులకు నిధులు ఎందుకు వేయలేదు? తన దివాళాకోరుతనాన్ని విపక్షాలపై నెట్టాలన్న కుట్రలు ఎందుకు? అని తూర్పారబట్టారు. ఇదే వైకాపా 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం ప్రభుత్వా న్ని ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టిందో కూడా గుర్తు చేసుకోవాలన్నారుు. ఏది ఏమైనా రాబోయే ది కూటమి ప్రభుత్వమే అన్న ప్రత్తిపాటి పెంచిన పింఛన్లు సహా సంక్షేమపథకాలతో అన్నివర్గాల వారికి త్వరలోనే మంచిరోజులు రాబోతున్నాయన్నారు. ప్రతినెల ఠంచనుగా ఇంటికే రూ. 4వేల పింఛను కావాలంటే సైకిల్ గుర్తుపైనే ఓటేసి గెలిపించాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.