
ఈనెల 11న కామారెడ్డి జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల మైదానంలో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన జన జాతర సభలో పాల్గొననున్న ఏఐసిసి అగ్రనేత ప్రియాంక గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..
సభ ఏర్పాట్లను ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో కలిసి కేరళ ఎంపీ రాజ్ మోహన్ ఉన్నితన్ సభ ప్రాంగణం పరిశీలన…
నారద వర్తమాల సమాచారం కామారెడ్డి జిల్లా ప్రతినిధి:మే09
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 11 న కామారెడ్డి జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల మైదానంలో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన జన జాతర సభలో పాల్గొననున్న ఎఐసీసి అగ్రనేత ప్రియాంక గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి ..సభ ఏర్పాట్లను ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో కలిసి కేరళ ఎంపీ రాజ్ మోహన్ ఉన్నితన్ సభా ప్రాంగణము పరిశీలన ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ..
ఇందిర గాంధీ కి ప్రతిరూపమైన ప్రియాంకగాంధీ ఎన్నికల ప్రచారానికి మొదటి సారి కామారెడ్డికి రావడం చాలా సంతోషకరమైన విషయం
11వ తేదీన ప్రియాంక గాంధీ సభను కనివిని ఎరుగని రీతిలో విజయ వంతం చేద్దాం.తెలంగాణలో ఎలాగైతే అధికారం లోకి వచ్చామో కేంద్రం లోకూడా అధికారం లోకి రాబోతున్నం.తిరిగి ఇంద్రమ్మ రాజ్యం రాబోతుంది రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతున్నారు10సంవత్సరల్లో
దేశ ప్రభుత్వ రంగ సంపదను అమ్మేశారు.ప్రజలు కష్టాల పాలు ఆత్మ హత్యల
పాలుఅయ్యారు.
అదాని, అంబానీ ప్రపంచ కుబేరులయ్యారు.కేరళ ఎంపీ రాజ్ మోహన్ ఉన్నితన్ మాట్లాడుతూ ఈ నెల 11 న ఉదయం 9:30 గం.లకు కామారెడ్డిలో జరిగే సభకు ప్రియాంక గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు.ఈ సభకు సుమారు 60 వేల నుంచి లక్ష మంది ప్రజలు వచ్చేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గాలి విస్తోంది.
పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ కావడం ఖాయం.సౌత్ ఇండియాలో మెజారిటీ ఎంపీ సీట్లు గెలవబోతున్నాం.ప్రధాని మోడీకి గెలుస్తామో లేదోనన్న భయం పట్టుకుంది కేంద్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టబోతుంది అని అన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.